AP: ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన తర్వాత లక్షల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించారు.
ఇలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ నిలిచారు. అన్ని సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకు వెళ్తూ కీలకపాత్ర పోషించారు ముఖ్యంగా కరోనా సమయంలో వాలంటీర్ల ప్రాధాన్యత ఏంటి అనేది ప్రతి ఒక్కరికి స్పష్టత ఇచ్చింది. ఇలా వాలంటీర్ పనితీరుకు ప్రభుత్వం 5000 రూపాయలను గౌరవ వేతనంగా ప్రకటించింది.
ఇక వాలంటీర్ వ్యవస్థను మొదట్లో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించిన ఎన్నికల నాటికి వాలంటీర్ వ్యవస్థ పై ప్రశంసలు కురిపించారు అదేవిధంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని వారికి 5 వేలకు బదులు పదివేల రూపాయల గౌరవ వేతనం అందజేస్తామని తెలిపారు. ఇలా ఎన్నికలకు ముందు వాలంటీర్లపై కూడా చంద్రబాబు నాయుడు వరాల జల్లులు కురిపించారు దీంతో వాలంటీర్లు కూడా కూటమి పార్టీలకే మద్దతు తెలిపారు.
ఇక ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న కూటమి పార్టీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి అయితే ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దాదాపు 7 నెలల పూర్తి అయిన ఇప్పటివరకు వాలంటీర్ల గురించి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు అంతేకాకుండా గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని తద్వారా తాము ఏమీ చేయలేని పరిస్థితి అంటూ చేతులెత్తేశారు.
ఇక వాలంటీర్లు చేస్తున్న పనులన్నీ కూడా ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేస్తున్నారు. దీంతో వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టనున్నట్లు స్పష్టమైనది. ఈ క్రమంలోనే నేటి నుంచి మూడు రోజుల పాటు వాలంటీర్లు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వనున్నారు. రేపు మోకాళ్ల మీద కూర్చొన భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. మరి మీరు నిరసనల వేల ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.