టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల సోదరుని అనుమానాస్పద మృతి

కరీంనగర్ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బుధవారం ఉదయం కరీంనగర్ శివారులోని రేకుర్తి వంతెన వద్ద రోడ్డు పక్కన ప్రభాకర్ పడిపోయి ఉండటాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

గంగుల ప్రభాకర్ మృతదేహం

ఉదయం వాకింగ్ కు వెళ్లని సమయంలో ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండెపోటుతో మరణించాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా తెలిసే అవకాశం ఉంది.