సంచలన వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదానికి కారణమయ్యాయి. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. దామరచర్ల మండలం కొండ్రపోల్ లో టిఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి తరపున ఆయన మంగళవారం ప్రచారంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలలో లబ్ధి పొందిన వారు టిఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు.

అంతటితో ఆగకుండా కాస్తా నోరు పెంచి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాకు ఓటేయకపోతే మా డబ్బును మాకు తిరిగి ఇచ్చేయాలని ఆయన అన్నారు. టిఆర్ఎస్ వ్యక్తులు కాకుండా మరే వ్యక్తులు సర్పంచ్ లుగా ఉన్నా గ్రామం అభివృద్ది చెందదన్నారు.

భాస్కరరావు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదానికి దారితీశాయి. ఎవరైనా సరే ఎన్నికలలో ఓటు వేయమని కోరవచ్చుకానీ ఈ విధంగా మాట్లాడుతారా అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఎమ్మెల్యే బెదిరింపులకు దిగడమేంటని గ్రామస్థులు ప్రశ్నించారు. ఇలాంటి బెదిరింపులను తాము లెక్క చేయమన్నారు. ఎవరైతే అభివద్ధి చేస్తారో వారికే ఓటు వేసి గెలిపిస్తామన్నారు. బెదిరింపు రాజకీయల పట్ల ప్రయోజనం ఉండదన్నారు.