శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో విషాదం

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో విషాదం జరిగింది. తిత్లీ తుఫాన్ ధాటికి కొబ్బరి చెట్లన్ని కుప్పకూలిపోయాయి. కొబ్బరి చెట్ల కింద పనిచేసుకుంటున్న వ్యక్తి పై చెట్టు కూలడంతో వ్యక్తి కూర్చున్న చోటే ప్రాణాలొదిలాడు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

చెట్టు కూలి అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తి

బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా మారిన తిత్లీ పలాస సమీపంలో తీరం ధాటికి తిత్లీ ధాటికి గాలులు భీభత్సం సృష్టించాయి. శ్రీకాకుళానికి 38 కి.మీటర్ల దూరంలోని ఒడిశా తీరం వరకు గాలులు వీచాయి. తుఫాను వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

భీకరమైన ఈదురు గాలులు

అధికారులతో సమీక్షిస్తున్న చంద్రబాబు

దాదాపు నదులన్నీ నిండటంతో వరద నీరు గ్రామాలలోకి వచ్చి చేరుతుంది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనేక ఇండ్లు పైకప్పులు లేచిపోయాయి. మరికొన్ని నేటమట్టమయ్యాయి. చాలా ప్రాంతాల్లో అరటి, జీడి, కొబ్బరి తోటలు నాశనమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగింది. అధికారులు, నాయకులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది మరణించినట్టుగా అధికారులు చెబుతున్నారు.