ఆర్ఎక్స్ 100 ద్వారా ఫేమస్ అయిన పాయల్ రాజ్ పుత్ విషాదంలో ఉంది. అందరి జీవితాల్లో కష్టాలు ఉన్నట్టుగానే పాయల్ రాజ్ పుత్ జీవితంలో కూడా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రతిరోజు మానసికంగా బాధపడుతున్నానని పాయల్ రాజ్ పుత్ తెలిపింది. ఇంతకీ విషయం ఏమిటంటే…
పాయల్ రాజ్ పుత్ కు సోదరుడు ధృవ్ రాజ్ పుత్ ఉండేవాడు. మూడు సంవత్సరాల క్రితం పాయల్ సోదరుడు ఇంటిని విడిచి వెళ్లాడు. 2016 మార్చి 27 న ధృవ్ వారి ఇల్లు వదిలి వెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తిరిగి రాలేదు. ఎక్కడ ఉన్నా తిరిగి రావాలని పాయల్ ట్విట్లర్ లో పోస్ట్ చేసింది. పాయల్ ట్విట్టర్ లో ఏం పోస్టు చేసిందంటే…
“నా సోదరుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లి మూడేళ్లు అవుతుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు సోదరా నీకు. నీకు ఈ మెసేజ్ అందుతుందని నా ఆకాంక్ష. ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఇరుక్కొని ఉంటే మాకు కాల్ చెయ్. ఒక్కసారి అయినా మాకు కాల్ చేయడానికి ప్రయత్నించు. నీ కోసం వేచి చూస్తున్నాం సోదరా” అంటూ పాయల్ రాజ్ పుత్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ద్వారా పాయల్ రాజ్ పుత్ కు తన సోదరుడు అంటే ఎంత ప్రేమో అర్దమవుతుందని నెటిజన్లు అన్నారు. పాయల్ చేసిన ట్వీట్ కింద ఉంది చూడండి.