Payal Rajputh: ఆమ్మో.. అన్నీ చూపించేస్తున్న పాయల్ రాజపుత్.. ఆ ఒక్క ముడి తీస్తే?

Payal Rajputh: అజయ్ భూపతి దర్శకత్వంలో హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె మొదటి సినిమాతోనే ఎంతో బోల్డ్ గా నటించి బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో వరుసగా పాయల్ రాజ్ పుత్ ఎన్నో అవకాశాలను అందుకున్నారు. అయితే ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇలా పలు చిత్రాల్లో నటిస్తూనే సోషల్ మీడియా వేదికగా ఈ బ్యూటీ ఎన్నో గ్లామరస్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ ఒక బోల్డ్ వీడియోని షేర్ చేసి ఆ వెంటనే డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకున్న నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు పెద్ద ఎత్తున ఈమెను సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన పాయల్ నేను అందరిలాంటి ఆడదాన్ని ఎవరికీ లేనివి నాలో ఏమీ లేవు అయినా ఏమీ చూడనట్టు అమాయకంగా మాట్లాడుతుంటారు అంటూ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఇలా నిత్యం సోషల్ మీడియాలో దారుణంగా నెగిటివ్ కామెంట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఈమె మాత్రం సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసే విషయంలో మాత్రం తగ్గేది లేదంటూ మరింత రెచ్చిపోతోంది. తాజాగా పాయల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ డ్రెస్ లో తన అందాలన్నిటినీ ఆరబోస్తూ ఉండడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే కొందరిని ఈ ఫోటో పై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.