హైదరాబాద్ నడిబొడ్డున విషాదం..తల్లి, కొడుకు ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి

చలి ఓ కుటుంబంలో విషాదం నింపింది. హైదారాబాద్ నడిబొడ్డున దారుణం జరిగింది. చలి పెడుతుందని ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకుంటే కుంపటి వారి ప్రాణాలను హరించింది. తల్లి, చేతికి అంది వచ్చిన కొడుకు చావుకు బొగ్గుల కుంపటి కారణమైంది.  అసలు వివారాలు ఏంటంటే..

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలానికి కంకిడి సత్యబాబు, అతని భార్య బుచ్చివేణి బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. జూబ్లీహిల్స్ లోని శేఖర్ రెడ్డి అనే వ్యాపారి ఇంట్లో పనికి కుదిరారు. వాచ్ మెన్ గా పని చేస్తూ శేఖర్ రెడ్డి ఇంట్లోని ఓ రూంలో ఉంటున్నారు. వీరి కుమారుడు పద్మరాజు రెండు రోజుల క్రితం ఓ సంస్థలో డెలివరీ బాయ్ గా చేరారు.

కూర్చున్న చోటే ప్రాణాలు విడిచిన తల్లి కొడుకు

బుధవారం ఉదయం శేఖర్ రెడ్డి పెంపుడు కుక్క చనిపోయింది. దానిని పూడ్చి పెట్టేందుకు సత్యబాబు డ్రైవర్ తో కలిసి వెళ్లాడు. బుధవారం ఉదయం బాగా చలిగా ఉండడంతో బుచ్చివేణి రెండు బొగ్గు కుంపటిలను ఇంట్లో ఏర్పాటు చేసింది. బయటి గాలి ఇంట్లోకి రావడంతో తలుపులు, కిటికిలు మూశారు. పద్మరాజు టివి చూస్తుండగా, బుచ్చివేణి కుర్చీలో కూర్చోని ఉంది. రూంలో పొగలు అలుముకోవడంతో ఊపిరాడకుండా ఇద్దరూ ఉన్న స్థలంలోనే చనిపోయారు. 

ఇంతలో సత్యబాబు ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా లోపలి నుంచి సమాధానం లేదు. దీంతో కంగారు పడిన సత్యబాబు అందరిని పిలిచి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. లోపల చూసే సరికి ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. దీంతో సత్యబాబు కన్నీరు మున్నీరయ్యారు. జీవితాంతం తోడుగా ఉంటానన్న అర్ధాంగి అర్దాంతరంగా కన్నుమూయడం, చేతికి అంది వచ్చిన కొడుకు ఇద్దరు ఒకేసారి తనువు చాలించడంతో సత్యబాబు కుప్పకూలిపోయాడు. ఆయన రోధించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది.  

పద్మరాజు

విషయరం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఊపిరాడక చనిపోయారా లేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టు మార్టం రిపోర్టు వస్తే కానీ ఏం చెప్పలేమని పోలీసులు తెలిపారు. బొగ్గులలో ఏమైనా కెమికల్ రసాయనాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటన విషాదాన్ని మిగిల్చింది.