కెటిఆర్ కు ఉత్తమ్ వేసిన 14 చిక్కు ప్రశ్నలేవో తెలుసా???

తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావుకు, పిసిసి అధ్యక్షుడికి చాలా రోజుల వాగ్యద్ధం నడుస్తూ ఉంది. ప్రెస్ కాన్ఫరెన్స్ లలో బహిరంగ సభలలో, ట్విట్లర్ లో… ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వారు ఒకరి మీద ఒక  ప్రశ్నల శరపరంపర కురిపించుకుంటున్నారు. ఆంధ్రా పార్టీ, తెలంగాణ ద్రోహ పార్టీ అయిన తెలుగుదేశంతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని చెబుతూఏ అమరవీరుడు కోరితే ఈపొత్తు పెట్టకుంటున్నారని విజృంభించారు. దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చాలా ఘాటుగా ఇచ్చారు. ఒకామె తో మీరు చేస్తే సంసారం, మరొకరు చేస్తేవ్యభిచారం అనే న్యాయం ఎమిటో చేప్పాలని, కెటిఆర్ ను, టిఆర్ ఎస్ ను ఇబ్బంది పెట్టే పద్నాలుగు ప్రశ్నలు వేశారు. వాటికి కెటిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముందా కేటీఆర్ అని ఉత్తమ్ ఢిల్లీ వెళుతూ గట్టిగానే అడిగారు.  ఉత్తమ్ వేసిన ప్రశ్నలు ఇవి:

1. మీరు  చేస్తే సంసారం (టిడిపితో పొత్తు)
పక్కోడు చేస్తే వ్యభిచారం ఎట్లా ఐతది మంత్రి గారు. గొంగట్లో తినుకుంటు వెంట్రుకలు ఏరినట్టు ఉంది మీ వ్యవహారం.

2. ఉద్యమకారులను పరిగెత్తించి కొట్టిన పట్నం మహేందర్ రెడ్డి ని మంత్రివర్గం లోకి తీసుకొమ్మని ఏ అమరుడు చెప్పాడు.

3. బిడ్డ కేసీఆర్ హైదరాబాద్ లో ఎట్లా తిరుగుతావో చూస్తా అని తెలుగుదేశం తరపున గెలిచిన తలసాని ని అప్రజాస్వామికంగా మంత్రివర్గంలోకి తీసుకొమ్మని ఏ అమరుడు కోరాడు.

4. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నన్ని రోజులు తెలంగాణ మీద విష ప్రచారం చేసి అనేకమంది యువకులు మనోవేదనకి గురై తెలంగాణ రాదేమో అని చనిపోవడానికి కారణం అయిన ఆంధ్ర మీడియా అధిపతులతో రాసుకు పూసుకు తిరగమని ఏ అమరుడు కోరిండు. వాళ్లకు అప్పనంగా పల్లి బఠానిలు పంచినట్టు భూములు పంచుతూన్నది ఎవరు??

5. సినిమా నటుడు నాగార్జున కబ్జాకోరు అని మీ నాయనా చాలా సార్లు చెప్పిండు. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ లో అదే నాగార్జున కి ప్రగతి భవన్ లో రెడ్ కార్పెట్ పలికి మరి ఎందుకు స్వాగతం పలుకుతున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులతో మీరెందుకు తిరుగుతున్నారు.

6. ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ ని దోచుకుంటున్నారు అని ఉద్యమ సమయంలో యువకులను రెచ్చగొట్టి
వచ్చిన తెలంగాణలో అదే కాంట్రాక్టర్ల తో అడ్డగోలుగా అంచనాలు పెంచి దోచుకు తినమని ఏ అమరుడు కోరాడు.

7.ఉద్యమంలో ఎంతో మంది చావడానికి కారణం అయిన,ఎన్నడూ జై తెలంగాణ అనని
ఎర్రబెల్లి, డి. శ్రీనివాస్, దానం నాగేందర్, తుమ్మల, ఇంద్రకరణ్, టి.కృష్ణా రెడ్డి, ఇప్పుడు ఎవరి చంకనెక్కి ఉరేగుతున్నారు.

8. పిల్లల్ని వాళ్ళ తల్లితండ్రులను జలగళ్ల పిక్కు తింటున్న సీమాంధ్ర కార్పొరేట్ కాలేజ్ లకు వత్తాసు పలుకుతున్నది ఎవరు.
ఏ భాష పేరుతో వచ్చి తెలంగాణ లో తిష్ట వేసి మనపై సీమాంధ్ర వాళ్ళు పెత్తనం చలయించారో అదే తెలుగు మహా సభలను 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవడు ఉత్సవాలు చేయమన్నారు.

9. మన యాస, భాష ని వెక్కిరుంచిన సినిమా వాళ్ళతో మీరు తిరగడంలో ఆంతర్యం ఏమిటి?

10.  మాట్లాడితే అమరుల అని మళ్ళీ భావోద్వేగాలు రెచ్చేగొడుతున్న మీరు,
దొడ్డిదారి లో మీ తాబేదార్లకు పదవులు కట్టబెడుతున్న మీరు తెలంగాణ మలి దశ అమరుడు శ్రీకాంత చారి తల్లిని  ఎమ్మెల్సీ నామినేషన్ ఎందుకు చెయ్యలేదు.

11.  మీ తమ్మున్ని రాజ్యసభ సభ్యుని చేశారు అదే అమరుల కుటుంబాల నుంచి ఎందుకు చెయ్యలేదు.

12. ఉద్యమ సమయంలో 1200 అమరులుచనిపోయారు అని ప్రతి వేదిక మీద చెప్పిన మీరు
తెలంగాణ వచ్చాక ఇస్తామన్నా సహాయం 400 మంది కుటుంబాలకు మాత్రమే ఎందుకు ఇచ్చిన్నట్టు?
మీరా అమరుల గురుంచి మాట్లాడేది.

13. స్వతంత్రంగా , నిస్వార్థంగా తెలంగాణ కోసం కొట్లాడిన కోదండరాం గారి గురించి మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.
మీ బాపు చంద్రబాబు చంకనెక్కి మంత్రి పదవి వెలగబెడుతూ జోనల్ వ్యవస్థ తీసేయాలి అని అసెంబ్లీ సాక్షిగా చెబుతున్న రోజుల్లోనే కోదండరాం గారు జయశంకర్ సార్, జనార్దన్ సార్, కేశవరావు జాదవ్ సార్ లాంటి వాళ్ళతో తెలంగాణ ఉద్యమం కోసం పని చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని స్థాయి కి మించి మాట్లాడవద్దు మంత్రి గారు.

14. మీరు చెప్పినట్టు వినడానికి ఇది ఎడ్డి తెలంగాణ కాదు.
నియంతృత్వ పోకడలను తిప్పికోట్టి అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే ప్రజాస్వామిక తెలంగాణ.