బ్రేకింగ్ న్యూస్… ఎమ్మెల్సీ అభ్యర్ధిని ప్రకటించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిని ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గూడురు నారాయణ రెడ్డిని టిపిసిసి ప్రకటించింది. ప్రస్తుతం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 21 మంది ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ టిడిపిలు కలిసి కూటమిగా ఏర్పడి 21 సీట్లు సాధించారు. దీంతో ఒక ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపు ఖాయమని భావించిన కాంగ్రెస్ రంగంలోకి దిగింది.

మరోవైపు టిఆర్ ఎస్ 5 స్థానాలకు ఎమ్మెల్సీలను ప్రకటించింది. 4 టిఆర్ఎస్, ఒక స్థానం ఎంఐఎంకి కేటాయించింది. దీంతో కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మధ్య రాజకీయం వేడెక్కింది. నాలుగు ఎమ్మెల్సీలకే అవకాశం ఉన్న టిఆర్ఎస్ ఐదో అభ్యర్దిని ఎలా ప్రకటిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. పలు దఫాలుగా సమావేశమైన కాంగ్రెస్ నేతలు చివరికి గూడురు నారాయణ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో గూడురు నారాయణరెడ్డి నామినేషన్ వేయనున్నారు. 

గూడూరు నారాయణ రెడ్డి

మూడు రోజులుగా టిపిసిసి సబ్ కమిటి ఎమ్మెల్సీ ఎన్నికకు వడపోత పోసి 12 మంది పేర్లు పరిశీలించారు. ముందుగా మర్రి శశిధర్ రెడ్డికి అవకాశం వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా గూడురు పేరు తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గూడురు నారాయణ రెడ్డి సీటు ఆశించినా దక్కలేదు. దీంతో గూడురుకు ఎమ్మెల్సీ అభ్యర్ధిగా అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకునిగా గూడురుకు పేరుంది.