జనసేన పార్టీకి అన్నీ ‘కొరత’లే.!

సోలోగా ఎన్నికల బరిలోకి దిగే ఉద్దేశ్యమైతే జనసేన పార్టీకి లేదు.! ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూనే వున్నారు. కానీ, సోలోగా వెళితేనే మంచిదన్న అభిప్రాయంతో జనసైనికులు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, జనసేన పార్టీ కోసం వాలంటీర్ల అవసరమొచ్చింది. జనసేన పార్టీకి నిధుల కొరత కూడా వుంది. అభ్యర్థుల సంగతి సరే సరి.! ఇన్ని సమస్యల నడుమ, జనసేన పార్టీ ముందుకు నడిచేదెలా.? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకూ పెద్దగా సమయం లేదు. ఈపాటికే జనసేన పార్టీ సర్వ సన్నద్ధమై వుండాల్సింది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి.

ఇప్పుడు హడావిడిగా నిధుల సమీకరణ, వాలంటీర్ల ఎంపిక.. ఈ అంశాలపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. మరోపక్క, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినిమా కమిట్మెంట్లు పూర్తి చేయాలి. ఇదంతా చాలా చాలా పెద్ద తలనొప్పి వ్యహారమే. కానీ, తప్పదు. పెద్దగా సీట్లను డిమాండ్ చేయకపోతే, తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకి కొంత వెసులుబాటు వుంటుంది.

పలు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరపున ఖర్చు చేయడానికీ, తెలుగుదేశం పార్టీ వెనకాల ‘బిగ్ షాట్స్’ వున్నారు. అయితే, ‘జనసేన సిద్ధాంతం అది కాదు’ అంటూ జనసేన నేతలు పైకి చెబుతున్నారు. ‘మేమే బలంగా వున్నాం.. టీడీపీ కంటే’ అని చెప్పుకునే క్రమంలో జనసేన తడబుడుతోంది.. తప్పడగులు వేస్తోంది రాజకీయంగా.

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో ఛాలెంజ్ చేయడం వల్ల జనసేనకి నష్టమే తప్ప లాభం లేదు. ఏం జరిగినా, టీడీపీకే లాభం.! అదే సమయంలో, టీడీపీతో కలిసి వెళ్ళడం జనసేనకీ కొంత ఇబ్బందికర పరిస్థితే. అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది జనసేన ప్రస్తుత పరిస్థితి.! ఈ గందరగోళం నుంచి జనసేన ఎలా బయటపడుతుందో ఏమో.!