ఆగస్టు 23 ప్రాముఖ్యం చాలా మంది తెలుగోళ్లకు తెలియదు, ఏం చేద్దాం

ఈ రోజు ఆగస్టు 23 అనే దానికంటే చాలా మంది తెలుగు వాళ్లకి ఈ తేదీ ప్రాముఖ్యం తెలియదు.

నిజానికి ఈ తేదీ ప్రాత: స్మరణీయం.

ఈ రోజు  ఆంధ్ర కేసరి  టంగుటూరి ప్రకాశం పంతులు  జన్మదినం.

తెలుగువారికి మొదటి సారి గుర్తింపు తెచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. కర్నూలు రాజధానిగా ఏర్పడిన  తొలి తెలుగురాష్ట్రాం ఆంధ్ర రాష్ట్రం.  అందుకే  ఆధునిక ఆంధ్రప్రదేశ్ పిత గా ఆయనను శ్రీమతి ఇందిరాగాంధీ అభివర్ణించింది.
.
కటిక దరిద్రంలో జన్మించి స్వయంకృషితో మనమందరమూ తేరిపార చూడలేని ఎత్తుకు ఎదిగినవాడు ఆ మహానుభావుడు! .
.
మహేంద్ర భోగాలనుభవించి.. మహాంధ్ర జన నాయకుడిగా ప్రజలచే కీర్తింప బడ్డవాడు టంగుటూరి!!.
.
దేశ దాస్య విమోచన యజ్ఞంలో తానొక సమిధగా మారి తన సర్వస్వం త్యాగం చేసిన మహానుభావుడు .
.
గుండు కెదురుగా గుండె చూపి సైమన్ గొ బ్యాక్ అని దిక్కులు పిక్కటిల్లెటట్లు నినదించినవాడు మన టంగుటూరి.
ఆంధ్రకేసరి అని జనం నినదించారు.

టంగుటూరి ప్రకాశం పంతులు ………
1872 ఆగస్టు 23 వ తారీఖున కనపర్తి గ్రామంలో మేనమామల ఇంట జన్మించారు.

దుడుకు స్వభావం ,ఆకతాయి చేష్టలకు ఆయన కేరాఫ్ అడ్రసు.
.
తండ్రిగారు ఈయన పన్నెండవ ఏటనే పరమపదించారు .. కుటుంబ భారాన్ని ఆయన తల్లి చాలా ధైర్యంగా మోసింది .ఒంగోలులో మునసబు కోర్టు ఎదురుగా ఒక హోటల్ ప్రారంభించి గౌరవప్రదమైన జీవనానికి మారు పేరై నిలిచింది. హోటలంటే హోటల్ కాదు, పూటకూళ్లమ్మ.
.
తన తల్లి ఒకరి మీద ఆధారపడకుండా తమని పెంచిన విధానానికి ఆయన చాలా గర్విస్తారు.
.
మిడిల్ స్కూలు పరీక్ష ఫీజు చెల్లించడానికి తల్లి పట్టుచీర తాకట్టు పెట్టేంత దారిద్ర్యం అనుభావించారాయన.
.
పితృసమానులు! ఆయన జీవితాన్ని తీర్చిదిద్దిన శిల్పి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు !…,ఆయన తోడ్పాటే లేకపోతే తానేమైపోయేవాడినో అని చెపుతారు ప్రకాశం పంతులు గారు .
.
ఒకసారి వీరేశలింగం పంతులుగారిమీద మంగమ్మ అనే స్త్రీతో సన్నిహితంగా ఉన్నాడని ఆరోపిస్తూ ఒకాయన ఒక కేసు వేసారు.
.
కేసు చివరిదశకు వచ్చి వీరేశలిగం గారికి జైలు శిక్ష పడడం దాదాపు ఖాయం అయ్యింది.
.
ఆ పరిస్థితిలో ఆ కేసు ప్రకాశం పంతులుగారి వద్దకు వచ్చింది .
.
అప్పుడు ఆయన ఇట్లాంటిదే ఒక కేసు ఇంగ్లాండులో జరిగిందని, రెంటికి మధ్య సారూప్యం తీసుకొనివచ్చి తన వాదనా పటిమ తో వీరేశలింగం గారిని కేసునుండి బయట పడేశారు.
.
ఆయన న్యాయవాద వృత్తిలో అపురూపమైన ఘట్టాలెన్నోఉన్నాయి
.
పేదరికాన్ని గుండె దిటవుతో అధిగమించి పెరిగి పెరిగి పెరిగి పెద్దల పెద్దయై రెండుచేతులా సంపాదించి .సంపాదించిన సర్వస్వం ప్రజలకు ధారపోసి జాతి రత్నం గా భాసిల్లిన ఆ మహా మనీషి పుట్టిన రోజు ఆగష్టు 23
.
ఆంధ్రుల ఆత్మగౌరవం !
ఆంధ్రకేసరి మన టంగుటూరి!!

అటువంటి స్వాతంత్ర సమరయోధిని, మహా నాయకుని మన ప్రభుత్వాలు ఎప్పుడో మరిచి పోయినయ్యి. కనీసం మనిషైనా మన బ్రాహ్మణుడు అయిన వారిని వారి పుట్టినరోజు న స్మరించుకొందాం