మూడు రాజధానులు.! 2024 ఎన్నికల లోపు సాధ్యమా.?

Three Capitals

మంత్రి గుడివాడ అమర్నాథ్ తన స్థాయికి మించి మూడు రాజధానుల విషయమై ప్రకటన చేసేశారని అనుకోవాలా.? ఇలాగని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం..’ అంటూ మంత్రి అంబటి రాంబాబు చాలా తెలివిగా తప్పించుకున్నారు.! గతంలో పోలవరం ప్రాజెక్టు విషయమై వైసీపీ సర్కారు అనేక డెడ్‌లైన్లు పెట్టి అభాసుపాలయ్యింది.

సీపీఎస్ రద్దు విషయంలో కావొచ్చు, మద్య నియంత్రణ – నిషేధం విసయంలో కావొచ్చు, వైసీపీ సర్కారు మాట తప్పింది, మడమ తిప్పాల్సి వచ్చింది కూడా.! మూడు రాజధానుల విషయంలో కూడా మాట తప్పడమూ, మడమ తిప్పడమూ జరిగిపోయాయ్.!

అసలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులనేవి అవసరమా.? కాదా.? అన్న చర్చ జరగనీయకుండానే, మూడు రాజధానుల్ని వైసీపీ ప్రకటించేసింది. అదే అతి పెద్ద తప్పిదం. సరిదిద్దుకోలేని పొరపాటు ఇది. అక్కడి నుంచీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే వెళుతోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లోపే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అసలు అదెలా సాధ్యం.? ఇప్పుడున్న అమరావతిని అభివృద్ధి చేయకుండా మిగతా రెండు రాజధానుల విషయంలో ఎలా ముందడుగు వేయగలుగుతారు.?

అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కానీ, అమరావతిలో అభివృద్ధి పనులు నిజానికి జరగడంలేదు. దీనిపై కోర్టుని ఆశ్రయిస్తున్నారు అమరావతికి భూములిచ్చిన రైతులు. వివాదం ముదిరి పాకాన పడనుందనే విషయం అర్థమవుతోంది.

సందట్లో సడేమియా.. మళ్ళీ ఈ మూడు రాజధానుల గోలేంటి.?