కాపు ఎమ్మెల్యేలు బాబుపై కోపంగా ఉన్నారా?

(PK)

తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు చంద్రబాబునాయుడిపై తిరుగుబాటు చేయనున్నారా…! చాపకింద నీరులా వీరంతా అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? ఉన్నత స్థాయి రాజకీయవర్గాల్లో రెండురోజుల నుంచి ఈ చర్చ బాగా జరుగుతోంది. 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు, ముగ్గురు ఎంపీలు, పలువురు ముఖ్య నాయకులు మొత్తం 25 మందికిపైగా బాబు ఝలక్‌ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారనే ది  అమరావతిలో ఇపుడు హాటాట్ టాపిక్ . చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్న వీరంతా కొద్దికాలంగా వరుసగా రహస్య సమావేశాలు జరుపుతున్నారని, ఒక్కొక్కరు పార్టీకి రాజీనామా చేస్తే ఉపయోగం ఉండదని, కలిసి కట్టుగా చేస్తే వచ్చే మైలేజి, గుర్తింపు ఎక్కువగా ఉంటుందని వీరంతా వ్యూహ రచన చేస్తున్నట్లు తెలిసింది

వీరంతా జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ పలుమార్లు వీరితో ఫోన్‌లో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారని సమాచారం. ఆ తర్వాత నంచి పవన్‌ అనుయాయులు టీడీపీలోని కాపు నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. వీరందరినీ ఒకేసారి పార్టీలో చేర్చుకునే ఉద్ధేశంతో పవన్‌ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే కాపు నేతలు పవన్‌తో వెళితే బాగుంటుందా జగన్‌ వద్దకు వెళితే ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే యోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ వైపు వెళ్లేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

పార్టీలోని కాపు నాయకుల వైఖరి అనుమానాస్పదంగా ఉండడంతో చాలారోజుల నుంచి చంద్రబాబు ఇంటిలిజెన్స్‌ ద్వారా వారి కదలికలపై పూర్తి నిఘా పెట్టారు. వారి ఫోన్లను ట్యాప్‌ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. తిరుగుబాటు యోచనలో ఉన్న నాయకులతో వారి సన్నిహితుల ద్వారా మాట్లాడిస్తూ బుజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ విషయం తనకు తెలియనట్లే పైకి వ్యవహరిస్తూ లోలోనే వారిని లొంగదీసుకునేందుకు, బయటకు వెళ్లకుండా ఆపేందుకు చంద్రబాబు కోటరీ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. ఏంజరుగుతుందో వేచిచూడాల్సివుంది.