చంద్రబాబు సెలెక్ట్ చేసిన వారిలో ఆ నలుగురే మొనగాళ్లు 

Those four TDP leaders doing good job
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుదేలైన పార్టీని బలోపేతం చేయడానికి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులను నియమించిన సంగతి తెలిసిందే.  అనేక వ్యతిరేకతలు, ప్రశంసల నడుమ ఇంఛార్జుల ఎంపికను పూర్తిచేశారు చంద్రబాబు నాయుడు.  వీరి ఎంపికలో ఇతర నేతల ప్రమేయం పెద్దగా లేకుండా అంతా చంద్రబాబుగారి చేతుల మీదుగానే, ఆయన ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే జరిగాయంటారు.  అలా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసిన నేతల్లో కొందరు బాధ్యతలు మోయలేక తేలిపోతుంటే కొందరు మాత్రం పర్వాలేదన్న  స్థాయిలో ఉన్నారు.  ఇంకొందరు మాత్రం చంద్రబాబు అంచనాలను అందుకుంటున్నారు.  వారిలో ప్రధానంగా నలుగురు పేర్లు వినబడుతున్నాయి.  
 
Those four TDP leaders doing good job
Those four TDP leaders doing good job
ఏలూరు పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారు.  అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సమస్యలు  తెలుసుకోవడం వాటికి తగిన పరిష్కారం చూపడం చేస్తున్నారట.  కేడర్ మొత్తాన్ని ఒకే దిశలో నడపడానికి ఆయన ఎంచుకుంటున్న వ్యూహాలు నేతలందరికీ సమ్మతంగా ఉంటున్నాయట.  అలాగే గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే  జీవీ ఆంజ‌నేయులు కూడా భేష్ అనిపించుకుంటున్నారు. 
 
ఒకప్పుడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఇంఛార్జ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారట.  ఎక్కువగా పాలకవర్గం తప్పుల మీద దృష్టి పెడుతూ వాటిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అవుతున్నారట.  అలాగే గుంటూరు జిల్లా బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం జిల్లా ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు సైతం నియిజకవర్గం పరిధిలో ఉన్న వైసీపీ నేతలను డామినేట్ చేసేలా  దూసుకుపోతున్నారు.  మొదటి నుండి ప్రజాదరణ కలిగిన నేత కావడంతో  జనంలోకి ఆయన మాటలు బలంగా వెళుతున్నాయి.  
 
శ్రీకాకుళం పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆముదాల ‌వ‌ల‌స మాజీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌ అయితే సంధించిన బాణంలా దూసుకుపోతున్నారు.  ఇప్పటికే ఆయనకు పాలన పక్షం సెగ గట్టిగా తగిలి ఉండటంతో ఆ మంట  ఆయన్ను కసిగా పనిచేసేలా చేస్తోంది.  అధికార వర్గాన్ని నిలదీయడానికి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారట.  క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నారు.  మొత్తానికి చంద్రబాబు ఎంచుకున్న వారిలో ఈ నలుగురు లీడర్లు మొనగాళ్లలా దూసుకుపోతున్నారు.