‘ఆ విషయం’లో జగన్ కి కోపమొచ్చింది అందుకే రోజా ని పట్టించుకోవడం లేదు ?

This is the truth behind Roja's comments

వైసీపీ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భోరున ఏడ్చింది అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాను ఎమ్మెల్యేనని, పైగా ఏపీఐఐసీ చైర్ పర్సన్ అని అయినా తనను ఎవ్వరూ పట్టించుకోవడంలేదని ఆమె కంట నీరు పెట్టుకొని ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసింది. అధికారులు తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో తనను పట్టించుకోవడం లేదని, కనీసం అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఫిర్యాదు చేసింది.ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాలకు కూడా ప్రొటోకాల్ పాటించడం లేదని రోజా ఆరోపించింది.

This is the truth behind Roja's comments
This is the truth behind Roja’s comments

ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపణలపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. రోజా ఓ రోడ్డు విషయంలో పనులు కావడం లేదని మాత్రమే ఫిర్యాదు చేసిందని చెప్పారు. ఆ అంశం తన పరిధిలో లేకపోయినా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు సూచించినట్లు చెప్పారు. ప్రొటోకాల్ విషయంలో ఏ శాసన సభ్యుడికి అన్యాయం జరిగినా తాము చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభా హక్కులు కాపాడటంలో అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడాలేదని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

రోజమ్మకి తెలియకుండానే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు నగిరి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం, వాటిపై కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉంది. మొన్నామధ్య ఇదే విషయంలో రోజాకు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఐతే ఇటీవల చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో టీటీడీకి చెందిన ఆరు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా తనను పిలవకపోవడంపై రోజా తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఎమ్మెల్యేకే ప్రాధాన్యం ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తారని ఆమె సన్నహితులతో అన్నట్లు సమాచారం.

రోజా ప్రవర్తన, వ్యవహారశైలి చూస్తే ఆమెకు తన నియోజకవర్గం కంటే డబ్బు సంపాదించి పెట్టే టీవీ షోల మీదనే ఆసక్తి ఎక్కువ. ఆంధ్రా రాజకీయ నాయకులకు చాలామందికి హైదరాబాదే స్థిర నివాసం. అక్కడ పదవులు, ఇక్కడ నివాసాలు. రోజా ఇందుకు మినహాయింపు కాదు. ఆమె హైదారాబాద్ లో ఉంటూ జబర్దస్త్ షో చేసుకుంటూ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిందని వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఆమె కార్పొరేషన్లో ఏం జరుగుతున్నదో తెలుసా అనే అనుమానం కలుగుతోంది. అసలు ఏపీఐఐసీ సంస్థ కార్యకలాపాల గురించి ఒక్కసారి కూడా మీడియాకు వివరించిన దాఖలాలు లేవు. అందుకే ఆమెను సర్కారు పట్టించుకోకుండా వదిలేసిందని పార్టీ శ్రేణుల ద్వారా వినబడుతుంది.