అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఏ సభలో మాట్లాడినా వైసీపీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి రాదని వైసీపీ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏపీ ప్రజలు వాస్తవంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేయడంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఫెయిల్ అయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని సంక్షేమం విషయంలో వైసీపీపై విమర్శలు చేయడంలో ఈ రెండు పార్టీలు విఫలమవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన, టీడీపీ గత కొన్నేళ్లలో ప్రజల కోసం ఏం చేశాయని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ ఎప్పుడు సినిమాల్లో యాక్టివ్ గా ఉంటారో ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారో చెప్పలేమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ, జనసేనలకు ప్రజల సంక్షేమం మాత్రం పట్టదా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన మారాల్సిన అవసరం అయితే ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ ఆర్థికంగా బలంగా ఉండగా జనసేన ఆర్థికంగా బలంగా లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలను ప్రకటించాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ రెండు పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తే మాత్రమే ఈ పార్టీలపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం అయితే ఉంది. మేనిఫెస్టోలను ప్రకటించకుండా సమయం వెళ్లదీయడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన రాబోయే రోజుల్లో కనీసం 4 నుంచి 5 సీట్లలో అయినా విజయం సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.