2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు నూటికి 99 శాతం ఖాయమని చాలామంది భావిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించకపోయినా జనసేన టీడీపీ పొత్తు ఇప్పటికే ఫిక్స్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ రెండు పార్టీల కూటమి అన్ని స్థానాలలో విజయం సాధిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవాలంటే మొదట బీజేపీ జనసేన పొత్తు విడిపోవాలి. అయితే విడిపోవడానికి జనసేన ఆసక్తి చూపినా బీజేపీ ఆసక్తి చూపుతుందా అనే ప్రశ్నలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఏపీలో పెద్దగా ప్రభావం సీపీఐ, మరికొన్ని పార్టీలు సైతం ఈ కూటమికి మద్దతు పలికే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నా బీజేపీ మాత్రం పొత్తుకు ఆసక్తి చూపడం లేదు. చంద్రబాబును నమ్మి గతంలోనే మోసపోయామని మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేమని బీజేపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలను కలుపుకుని కూడా వైసీపీని ఓడించకపోతే మాత్రం ఆ తర్వాత టీడీపీ, జనసేన తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి.
భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ, జనసేన అడుగులు వేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి సీటు విషయంలో బేధాభిప్రాయాలు వచ్చినా, పొత్తులకు సంబంధించి సమస్యలు వస్తే మాత్రం పొత్తుకు బ్రేక్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.