ఏపీ బీజేపీకి ఉన్న ఏకైక ఆప్షన్ ఇదే.. ఆ విధంగా ముందుకెళ్లబోతుందా?

ఏపీలో రాజకీయాలు జోరందుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. తాాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ భేటీ అయ్యారు. దీంతో అందరిలో చర్చ మొదలైంది. చంద్రబాబు, పవన్ భేటీలతో ఏపీలో రాజకీయ పొత్తులపై క్లారిటీ అనేది అయితే ఇంకా రాలేదు. ఎన్నికలకు దగ్గరగా పొత్తుల గురించి మాట్లాడుతామని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు అందరి చూపు బీజేపీపై ఉంది.

ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంక్ ఎక్కువగా లేదని చెప్పొచ్చు. కానీ అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని, పరిస్థితులను దారుణంగా మార్చేస్తాడని టాక్ వినిపిస్తోంది. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో కూడా తన పంజా విసరాలని మరికొందరు అనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షాలన్నింటినీ కట్టడి చేసి ఒక్క వైసీపీ నేతలే రోడ్లపై ర్యాలీలు నిర్వహిస్తుండటం ఏపీలో గమనించవచ్చు.

ఏపీలో రాబోవు రోజుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పలేం. అందుకే బీజేపీని కూడా కలుపుకుని జనసేన ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఏపీ బీజేపీ నేతలు ఇది వరకూ కూడా జనసేనతో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అది జగన్ కే లాభం తెచ్చింది. అందుకే పవన్ వెనక్కి వెళ్లిపోయారు. దీంతో బీజేపీ ఏపీలో ఒంటరిదైపోయింది.

ఇప్పుడు వైసీపీతో కలవాలా లేకుంటే టీడీపీతోనే అన్న అంశంపై బీజేపీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ హైకమాండ్ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం దీని గురించి ఆలోచనలో ఉంది. ఎన్నికల నేపథ్యంలో రాబోవు రోజుల్లో అనేక పరిణామాలు మార్పు చెందే అవకాశం ఉంది. మొత్తానికి బీజేపీ అటు వైసీపీతోనా లేక ఇటు టీడీపీతోనా అనేది తేల్చుకోవాల్సి ఉంది. ఏదేమైనా గెలుపు కోసం అన్ని పార్టీలు కష్టపడుతున్నాయి. తమదైన శైలిలో వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నాయి.