వైఎస్ పాలనకు జగన్ పాలనకు తేడా ఇదే.. ఇద్దరి లక్ష్యాలు ఒకటే కానీ?

YS Jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది సీఎంల పాలన గురించి ప్రజలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారనే సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు అమలు చేసిన ఎన్నో పథకాలు సామాన్య ప్రజలకు తీవ్రస్థాయిలో ప్రయోజనం చేకూర్చాయి. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించగా చంద్రబాబు పాలనపై ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేశారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి లక్ కలిసొచ్చింది.

మామకు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రోజుల్లో కూడా ఎంతోమందికి వెన్నుపోటు పొడిచారనే సంగతి తెలిసిందే. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగింది. పేదల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన పథకాల వల్ల పేద ప్రజలు పొందిన ప్రయోజనాలు అన్నీఇన్నీ కావనే సంగతి తెలిసిందే.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందింది. ఈ పథకం వల్ల పేద ప్రజలకు ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యం కలిగింది. వైఎస్సార్ అమలు చేస్తున్న పథకాలను మించి స్కీమ్స్ ను అమలు చేయడం అసాధ్యమని కామెంట్లు వినిపించాయి. చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చినా ఆ హామీలను సరిగ్గా నెరవేర్చలేదనే సంగతి తెలిసిందే.

అయితే వైఎస్సార్ ను మించి పథకాలను అమలు చేయడం ద్వారా సీఎం జగన్ ప్రశంసలు పొందారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో దాదాపుగా 95 శాతం హామీలను జగన్ నెరవేర్చారు. అయితే అన్ని వర్గాల ప్రజలను మెప్పించే విషయంలో వైఎస్సార్ బ్యాలెన్స్ చేస్తే జగన్ మాత్రం ఫెయిల్ అయ్యారు. జగన్ కూడా ఈ విషయంలో వైఎస్సార్ ను ఫాలో అయ్యి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.