ఎంపీ అయ్యే పవన్ ఎమ్మెల్యే మాత్రం కాలేరా.. ఆ ప్రశ్నకు జవాబుందా పవన్?

Vishaka Gharjana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నం చేస్తున్నా ఆయన కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. సినిమాలలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలలో చేదు ఫలితాలే మిగులుతున్నాయి. తాజాగా పవన్ తాను తలచుకుని ఉంటే 2009 సంవత్సరంలోనే ఎంపీ అయ్యేవాడినని వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు రాజకీయాలపై అవగాహన ఉన్నవాళ్లకు నవ్వు తెప్పిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు స్థానాలలో ఏ స్థానం నుంచి పవన్ గెలవలేదు. 13 సంవత్సరాల క్రితమే ఎంపీ అయ్యే సత్తా ఉన్న పవన్ మూడేళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోయారని నెటిజన్లు ప్రశ్నిస్తుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ భవిష్యత్తు గురించి ప్రస్తావించకుండా గతం గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల జనసేన పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ చేస్తున్న కామెంట్ల వల్ల చాలా సందర్భాల్లో ఆయనపై విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో కూడా ఓటమిపాలైతే ఆయన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉంది.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సక్సెస్ కావాలంటే చాలా విషయాలకు సంబంధించి ఆయన మారాల్సిన అవసరం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీపై ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగే దిశగా పవన్ అడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ను అభిమానించే వాళ్లు ఆయనకు ఓట్లు వేసినా ఆయన సులువుగా ఎమ్మెల్యే అవుతారని అయితే ప్రజల్లో మంచి ఒపీనియన్ తెచ్చుకోవడంలో పవన్ ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.