2019 ఎన్నికల్లో ఏపీలో గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు గెలవడానికి పరోక్షంగా జగన్ కారణమనే సంగతి తెలిసిందే. వైసీపీపై ప్రజల్లో ఉన్న అభిమానమే ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుకు కారణమైంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీ పరువు పోవడానికి కారణమవుతున్నారు. ఎన్నికలకు చాలా సమయం ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం కష్టమని తెలుస్తోంది.
కొంతమంది వైసీపీ నేతలు తప్పు చేశారని తెలిసినా జగన్ సర్కార్ మాత్రం వాళ్ల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అదే సమయంలో కొంతమంది నేతలు ఎంతో కష్టపడుతున్నా వైసీపీ వాళ్లను కూడా పట్టించుకోవడం లేదని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీకి చెడు చేస్తున్న వాళ్లను గుర్తించి జగన్ వాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని చెప్పవచ్చు.
2024 ఎన్నికల్లో వైసిపీకి గెలుపు సులువే అయినా జగన్ సర్కార్ ఎక్కువ స్థానాలలో విజయం సాధించాలంటే మాత్రం ఏ ఒక్క విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. జగన్ సర్కార్ కు పాలనలో అనుభవం లేకపోవడం వల్లే చిన్నచిన్న తప్పులు జరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ కంచుకోటలు అయిన నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ గెలవడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వైసీపీ పార్టీ విషయంలో జరుగుతున్న పొరపాట్లపై దృష్టి పెట్టి ఈ తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతుందేమో చూడాలి. వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే విషయంలో సైతం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇవే తప్పులు రిపీట్ అయితే జగన్ సర్కార్ మూల్యం అనుభవించాల్సి ఉంటుంది.