ప్రజల్లో వ్యతిరేకత వస్తే పోయేది చంద్రబాబు పరువే.. ఇదేం ఖర్మ బాబూ?

రాజకీయ నేతల ప్రణాళికలు ప్రతిసారి అనుకున్న విధంగా జరుగుతాయా? అనే ప్రశ్నకు కాదనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఇదేం ఖర్మ కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అనుకూల ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జగన్ పై వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకత చంద్రబాబుపై ఉన్న స్థాయిలో అయితే లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ కార్యక్రమం విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే పోయేది మాత్రం చంద్రబాబు పరువేననే సంగతి తెలిసిందే. ఇదేం ఖర్మ బాబూ అనే పరిస్థితి ఎదురైతే చంద్రబాబుకు కలిగే నష్టం అంతాఇంతా కాదు. చంద్రబాబు నాయుడు వైసీపీపై నెగిటివ్ గా ప్రచారం చేయాలని భావిస్తే పోయేది ఆ పార్టీ పరువేననే సంగతి తెలిసిందే. చంద్రబాబు తనకు ఎంతో అనుభవం ఉండి కూడా ఈ తరహా కార్యక్రమాలకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు సర్కార్ అమలు చేసిన పథకాలపై ప్రజల్లో కూడా ఒకింత నెగిటివ్ అభిప్రాయం ఉందనే సంగతి తెలిసిందే. టీడీపీ అద్భుతమైన మేనిఫెస్టోను ప్రకటించినా ఆ మేనిఫెస్టోను అమలు చేసే అవకాశం తక్కువేననే సంగతి తెలిసిందే. చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చాలామంది సూచనలు చేస్తున్నారు. నిర్ణయాల విషయంలో తప్పటడుగులు వేస్తే మరోసారి ఘోర పరాజయం తప్పదు.

చంద్రబాబుకు ఎల్లో మీడియా వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు గురించి ఆ మీడియాలో వస్తున్న వార్తలు ప్రజలు నమ్మలేని విధంగా ఉండటం కూడా పార్టీకి మైనస్ అవుతోంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకుంటారో చూడాల్సి ఉంది.