జగన్, చంద్రబాబు, పవన్ లలో ఎవరికీ నమ్మకం లేదట.. 2024లో సీఎం ఎవరో?

2024 ఎన్నికల్లో ఏపీ సీఎం ఎవరవుతారనే ప్రశ్నకు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వేర్వేరు పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. ప్రజలలో సైతం 2024 ఎన్నికల్లో కొంతమంది వైసీపీకి ఓటేస్తామని చెబుతుండగా మరి కొందరు వైసీపీకి ఓటు వేసే ఛాన్స్ లేదని తేల్చి చెబుతున్నారు. అయితే జగన్, చంద్రబాబు, పవన్ లలో ఎవరికీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే కాన్ఫిడెన్స్ లేకపోవడం గమనార్హం.

ఏపీ సీఎం జగన్ ఏ కార్యక్రమంలో మాట్లాడినా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారే తప్ప వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చెప్పడంలో విఫలమవుతున్నారు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నా జగన్ స్పీచ్ మారడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెప్పే జగన్ అధికారంలో ఉన్న వైసీపీ అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేసిందో చెప్పలేకపోతున్నారు.

అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను తీర్చడంపై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు 2024 ఎన్నికల సమయంలో జగన్ ఓటుకు 3000 రూపాయల చొప్పున ఇస్తారని చెబుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజలు డబ్బులు ఇచ్చిన పార్టీకి ఓటేస్తారని అనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎవరికీ అర్థం కావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారో ఎప్పుడు యాక్టివ్ గా ఉండరో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 2024లో కచ్చితంగా సీఎం అవుతానని చంద్రబాబు, జగన్, పవన్ లలో ఎవరికీ నమ్మకం లేదు. ఎన్నికలకు మరో 20 నెలల సమయం ఉండటంతో ఈ 20 నెలలలో పరిస్థితులు మారే ఛాన్స్ అయితే ఉంటుంది.