దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి పథంలో ముందుకెళుతున్నా రైతులకు మాత్రం ఆశించిన ఫలితాలు దక్కడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. అయితే 5 ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతున్నాయి. ఈ 5 పథకాల ద్వారా రైతులు ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కూడా ఒకటి.
ఈ స్కీమ్ ద్వారా రైతులకు మూడు వాయిదాల్లో 2,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేస్తోంది. 2 హెక్టార్ల వరకు భూమి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్ ను పొందవచ్చు. రైతులకు ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
కేంద్రం అందిస్తున్న స్కీమ్స్ లో ప్రధానమంత్రి ఆవాస్ స్కీమ్ కూడా ఒకటి. ఇళ్లు లేని రైతులు ఈ స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ కోసం 6 లక్షల రూపాయల వరకు రుణం తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కేంద్రం రైతులకు బెనిఫిట్ కలిగేలా ప్రధానమంత్రి జన్ ధన్ పథకం అమలు చేస్తుండటం గమనార్హం.
ఈ స్కీమ్ ద్వారా రైతులు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను ఓపెన్ చేసి బ్యాంక్ లావాదేవీలను జరిపే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లకు ప్రభుత్వం నుంచి పరోక్షంగా 1,30,000 రూపాయల బెనిఫిట్ కలుగుతుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్స్ కూడా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పవచ్చు.