టిఆర్ ఎస్ గెలుపు ధీమాకు కారణం ఆ 1,03,968 రుపాయలే…

పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని  తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు చాలా ధీమాతో ఉన్నారు. దీనికి కారణం, లక్షా మూడు వేల  తొమ్మిది వందల అరవై ఎనిమిది (1,03,968) రుపాయాలట.

ఈ మొత్తాన్ని పెరిగిన ధరల రీత్యా  రెండు లక్షల దాటేట్లు చేసేందుకు ఏర్పాట్ల జరుగుతున్నాయి. ఈ వ్యవహారాన్ని రాజ్యసభ సభ్యుడు కె కెశవరావు నాయకత్వంలోని మెనిఫెస్టో కమిటీ పరిశీలిస్తున్నది. నిన్న శనివారం నాడు ఈ కమిటీ పార్టీ కార్యాలయం సమావేశమయి  ఈ విషయం క్షుణ్ణంగా చర్చింది. అందువల్ల తెలంగాణ రాష్ట్ర సమితి మానిఫెస్టో బయటకు రాగానే ఒక సన్సేషన్ క్రియేట్ చేస్తుందని, అది గెలుపుకు బాట వేస్తుందని కమిటీ సభ్యులొకరు చెప్పారు.

ఈ రు. 1,03,968 రహస్యం ఏమిటో తెలుసా?

తెలంగాణ ప్రస్తుతం అన్ని రకాల సంక్షేమ పథకాలుదాదాపు 42  దాకా ఉన్నాయట. వీటన్నింటి వల్ల అన్ని కులాలకు, మతాలకు సంబంధించి దాదాపు  రెండు కోట్ల పైబడి మేలుపొందుతున్నారు. ఈ పథకాలు అమలుచేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వం యేటా రు. 52 వేల కోట్లు ఖర్చుచేస్తున్నది. ఇందులో చాలా మటుకు నగదు బదిలీ పథకాలున్నాయి. అంటే చాలా పథకాలలో లబ్దిదారులకు నేరుగా నగదు అందుతూ ఉంది.  ఇలా ప్రతిమనిషికి నెలకు రు. 2166 అందుతున్నాయి. ఈ లెక్కన  నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు రు. 8664 సమానమయిన సహాయం అందుతూ ఉంది. ఇందులో కొంత నగదు రూపంలో కొంత ఇతర రూపాలలో లభిస్తూ ఉంది. అంటే ప్రతి సంవత్సరం ఈ లబ్దిదారులల కుటుంబానకి రు. 1,03,968 అందుతున్నాయి. అది ఈ మొత్తం రహస్యం.

డాక్టర్ కెకె కమిటీ ఇపుడు ఇతర పార్టీలు చేస్తున్న హామీలను పరిశీలిస్తున్నది. కాంగ్రెస్ వాళ్లేమిచేయాలనుకుంటున్నారు, ఏహామీలిస్తున్నారు, అదేవిధంగా బిజెపి ఏమి హామీ ఇస్తున్నది కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తున్నది.  టిఆర్ ఎస్ మానిఫెస్టో అంశాలను తలదన్నే విధంగా ఉంటుందని, తమ మ్యానిఫెస్టోలో ఇంతకంటే ఎక్కువగా లబ్ది చేకూర్చే అంశాలుంటాయని ఆయన చెప్పారు. ఇపుడున్న రు. 1,03,968  వార్షి క సహాయాన్ని రెండు లక్షల దాటించేందుకు కృషిచేస్తున్నామని ఆయన చెప్పారు.  ఉన్న పథకాలను మెరుగుపర్చడం, సహాయం పెంచడం, కొత్త సహాయ పథకాలను చేర్చడం వల్ల  2019 ఎన్నికల తర్వాత కెసియార్ రెండో సారి ముఖ్యమంత్రి కాగానే ఈ సహాయం రెట్టి ంపవుతుంది.

ఈ విషయాన్ని ఇప్పటికే పరోక్షంగా ముఖ్యమంత్రి చెబుతూ వస్తున్నారు.మ్యానిఫెస్టో విడుదల కాగానే  ఈ మొత్తం గురించి ముఖ్యమంత్రి  వివరిస్తూ ప్రచారం ఉధృతి పెంచుతారని ఆయన చెప్పారు.

కెసియార్  ప్రచారం అనుకున్న లక్ష్యం నేరవేరుస్తున్నదని, ఆయన  ప్రసంగాల వల్ల అనేక కొత్త అంశాలు చర్చనీయాంశమయినాయని అయన చెప్పారు.