ఆంధ్ర ప్రదేశ్: తాజాగా జరిగిన పంచాయితీ ఎన్నికలలో ప్రధాన పార్టీలు అనేక చోట్ల డబ్బుతోనో, దౌర్జన్యంతోనో అధికారాన్ని సాధించుకున్నాయి. ‘అధికారం మా చేతుల్లో వుందని మర్చిపోవద్దు… మేం గెలవకపోతే, మీ గ్రామం అభివృద్ధి చెందనీయం… ’ అని ప్రత్యక్షంగా ప్రజలను బెదిరించిన అధికార పార్టీ నేతలు చాలామందే కనిపించారు. ఖర్చు చేసి గెలిచాం… దానికి రెండింతలు వెనకేసుకోవాలనే ధోరణిలోనే అడ్డదారుల్లో గెలిచిన నేతలుంటారని అందరికి తెలిసిన విషయమే.
పవన్ కళ్యాణ్… విప్లవాత్మకమైన సిద్ధాంతాలతో జనసేనను ఏర్పాటు చేసి నూతన రాజకీయాలతో నవసమాజ స్థాపనకై పోరాటాలు చేస్తున్నారు. నోటు ఇవ్వకుండా ఓటు సాధించి గెలవాలి తప్పా అద్దడారులు అనుసరించకూడదనే న్యూ ఏజ్ పాలిటిక్స్ తో జనసేన పార్టీ ముందుకెళుతోంది. ఓడితే కుంగిపోవడం, గెలిస్తే పొంగిపోవడం.. జనసేనకు తెలియదని, గెలిస్తే.. ప్రజల కోసం పనిచేస్తాం.. ఓడితే.. ప్రజల కోసం ఇంకా గట్టిగా పోరాడతాం… అన్నది మా సిద్ధాంతం అని జనసేన సామాన్య కార్యకర్తలు ధైర్యంగా చెబుతారు.
పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన జనసేన మద్దతుదారులతో ఆ పార్టీ అధినాయకత్వం వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గెలిచిన వారికి ‘లోకల్ గవర్నెన్స్’పై శిక్షణ ఇస్తామంటూ జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు, ప్రజల్ని ఆలోచింపచేస్తున్నాయి. గ్రామ పంచాయితీలకు నిధులు కేంద్రం నుంచి వస్తాయనీ, ఆ నిధుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో జనసేన విస్పష్టంగా తెలియజేస్తుందనీ, ఒకవేళ అధికార పార్టీ నేతలు గ్రామాల అభివృద్ధికి అడ్డు తగిలితే, గ్రామాల తరఫున నిలబడేందుకు తాను ముందుంటానని ఇప్పటికే జనసేన అధినేత స్పష్టం చేశారు.
గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు ఏం చేయాలి.? అన్నదానిపై శిక్షణ ఇవ్వాలన్న ఆలోచనే అత్యద్భుతమైనది. ఇందుకే, జనసేన పార్టీకి చాలా గ్రామాల్లో జనం పట్టం కట్టింది. మార్పు భారీగా నమోదుకానప్పటికీ గుర్తించదగిన రీతిలోనే కనిపించింది. అసలు మొదలవటమే అతిపెద్ద విజయంగా చెప్పుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీని కాదని, బెదిరింపులకు భయపడకుండా, డబ్బుకు ఆశపడకుండా ఒక కొత్త పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. ఇది జనసేన సాధించిన ఘనవిజయంగా కనిపిస్తుంది. ఇలానే ముందుకు సాగితే జనసేన అనుకున్నది సాధించటం ఖాయంగా కనిపిస్తుంది.