అన్నా జగనన్నా.. ఏందన్నా ఇది అంటోన్న – జగన్ వీరాభిమానులు !

The implementation of welfare programs in Andhra Pradesh will be hampered

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో తప్పులేదు కానీ అప్పులు చేసి మరీ   చేయడమే ఇప్పుడు రాష్ట్రానికి పెద్ద ఇబ్బందిగా మారిందని అంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గతంలో ఎవరూ ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం చాలావరకు కంపెనీలు రాష్ట్రానికి వచ్చేవి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు అన్నీ కూడా వెనకడుగు వేస్తున్నాయి. గతంలో పెట్టుబడులు పెట్టడానికి కొన్ని కంపెనీలు ప్రయత్నాలు చేసినా సరే ఇప్పుడు ఉన్న పరిణామాల నేపథ్యంలో పెట్టుబడులు పెడితే అనవసరంగా ఇబ్బందులు వస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి.

The implementation of welfare programs in Andhra Pradesh will be hampered
The implementation of welfare programs in Andhra Pradesh will be hampered

దీని కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగం కూడా భారీగా పెరిగి పోతుంది. గతంలో చంద్రబాబు నాయుడు పెట్టుబడులు పెడితే పదేపదే ఎద్దేవా చేస్తూ మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. ఇక రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్దగా ఎక్కడా జరగడంలేదని అర్ధమవుతుంది. పక్క రాష్ట్రాలకు పెట్టుబడులు వస్తున్నాయి. పక్కనే ఉన్న తమిళనాడు, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు వస్తున్నా ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఇస్తరాకులు కంపెనీ కూడా పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

అయితే పరిశ్రమల శాఖ ఈ విషయంలో ఘోరంగా విఫలమైందని ఆ శాఖకు ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదని పైగా ఆ శాఖలో ఉన్న నిధులను కూడా తెచ్చి ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పరిశ్రమలు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. దీని కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగం కూడా భారీగా పెరిగి పోతుంది. అధికారంలోకి వచ్చాక ఏడాది ఏడాదికి ఉద్యోగ కల్పన ఇచ్చి నిరుద్యోగం అనే పదాన్ని రాష్ట్రం నుండి తరిమికొడతాం అని కబుర్లు చెప్పిన జగన్ ని తలుచుకుని ఆయన అభిమానులే తలలు పట్టుకుంటున్నారు.