తాను చనిపోతూ 42 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్.. అసలేమైందంటే?

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగడం మరి ఎక్కువ అవుతున్నాయి. నిత్యం రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా విహారయాత్రలకు దైవదర్శనాలకు వెళ్లినవారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఇకపోతే తాజాగా ఇలాంటి ఘటననెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన బస్సు డ్రైవర్ తాను చనిపోతూ 42 మంది ప్రాణాలను కాపాడటం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే…

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన 42 మంది అయ్యప్ప స్వామి మాల ధరించి శబరి వెళ్లడానికి ఒక ప్రైవేటు బస్సును మాట్లాడుకొని వారు శబరిమల యాత్రకు బయలుదేరారు. ఇలా మధ్యలో దైవ క్షేత్రాలన్నింటినీ సందర్శించుకుని వెళ్తున్నారు. గురువారం సాయంత్రం ఈ బస్సు నెల్లూరు జిల్లాకు చేరుకుంది. బోగోలు మండలంలోని కడనూతల చెరువు ప్రాంతానికి చేరుకునేసరికి బస్సు డ్రైవర్‌ భాస్కర్‌ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయనకు చాతిలో నొప్పిగా అనిపించడంతో అప్పటికి కొంత దూరం పాటు బస్సు నడిపినప్పటికీ తనకు గుండెపోటు వస్తుందని ముందుగానే గ్రహించిన ఆయన బస్సు పక్కకు ఆపి వేశారు.

ఇలా బస్సు రోడ్డు పక్కన ఆపివేసి డ్రైవర్ వెనుక పక్క ఉన్నటువంటి ఓ చెక్క బల్లపై పడిపోయారు. ఇలా బస్సు ఆగడంతో అయ్యప్ప స్వాములు ఏం జరిగిందని ముందుకు రాగా డ్రైవర్ వెనుక సీట్ లో డ్రైవర్ పడిపోయి ఉండడం చూసి అతనిని లేపడానికి ప్రయత్నించారు. అయితే ఆయనలో ఏమాత్రం చలనం లేకపోగా తుది శ్వాస విడిచారని గ్రహించారు. ఇలా తనకు గుండెపోటు వస్తుందని ముందుగానే గ్రహించిన బస్సు డ్రైవర్ అలాగే డ్రైవింగ్ చేస్తున్న 42 మంది ప్రాణాలను పణంగా పెట్టకుండా తనుప్రాణాలు వదులుతూ మిగిలిన వారందరి ప్రాణాలను కాపాడారు.