వై ఎస్ జగన్ మ్యాటర్ లో మోడీ ఇందుకే సైలెంట్ గా ఉన్నాడు .. షాక్ సిద్ధమైంది?

మోదీ…షాల వ్యూహాల్ని అంచ‌నా వేయ‌డం అంత ఈజీ కాదు. సౌత్ లోనూ క‌మ‌ల‌నాథులు పావులు క‌దుపుతున్నారంటే? కార‌ణం ఆ ఇద్ద‌రే. స్థానిక నేత‌లే చేయ‌లేనిది ఆ ఇద్ద‌రి కార‌ణంగా ద‌క్షిణాది రాష్ర్టాల్లో సుసాద్యం అవుతుంటే? ఆ రెండు త‌ల‌కాయ‌లు ఎంత తెలివైన‌వో అర్ధ‌మ‌వుతోంది. కాలం కూడా అలాగే క‌లిసొస్తుంది. మోదీ_షా ఏది అనుకుంటే అది జ‌రిగిపోయేలా క‌నిపిస్తున్నాయ్ రోజులు. ఒక‌వైపు ఎన్నిక‌ల్లో విజ‌యాలు..మ‌రోవైపు ఇత‌ర పార్టీ అధికారంలో ఉన్నా..రాష్ర్టాల్లో న‌యానో..భ‌యానో ప్ర‌భుత్వాల్ని లొంగ దీసుకోవ‌డం చూస్తుంటే అర్ధ‌మ‌వుతోంది. ఇక ఏపీలో బీజేపీ ఎలాంటి వ్యూహాల‌తో ముందుకు వెళ్తుందో తెలిసిందే.

modi-jagan
modi-jagan

సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముందు నుంచి ఆహా..ఓహో అని ఆకాశానికి ఎత్తేసిన మోదీ వెనుక నుండి గోతులు తవ్వుతున్న‌ట్లే…జ‌గ‌న్ ని కోలుకోలేని దెబ్బ‌కొట్ట‌డానికి పావులు క‌దుపుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అదే జ‌మిలి ఎన్నిక‌లు. దేశ‌మంత‌టా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించి జ‌గ‌న్ ని సైడ్ ఏవేసే స్కెచ్ మోదీ ద‌గ్గ‌ర సిద్దంగా ఉంద‌ని అంటున్నారు. న‌వంబ‌ర్ లో జ‌ర‌గాల్సిన బీహార్ ఎన్నిక‌లు, ఆ త‌ర్వాతి ఏడాది జ‌ర‌గాల్సిన త‌మిళ‌నాడు, ప‌శ్చిమబెంగాల్ ఎన్నిక‌లు, 2022 లో జ‌ర‌గాల్సిన‌ య‌పీ ఎన్నిక‌లు- ఆ త‌ర్వాత ఆర్డ‌ర్ లో జ‌ర‌గాల్సిన రాష్ర్టాల ఎన్నిక‌లు, క‌రోనా కార‌ణాలు విశ్లేషించుకుని 2022 లో అన్ని రాష్ర్టాల ఎన్నిక‌లు ఒకేసారి నిర్వ‌హిస్తే జ‌గ‌న్ కి షాక్ గానే ఉంటుందంటున్నారు.

జ‌గ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ 15 నెల‌ల పాల‌నే పూర్తిచేసారు. అంటే పావు వంతు పూర్త‌యింది. ఇంకా మూడొంత్తుల పాల‌న ప్ర‌జ‌ల‌కు అందించాల్సి ఉంది. 2024 ఎన్నిక‌ల లోపు దిబెస్ట్ సీఎంగా ఏపీ ప్ర‌జ‌ల్లో కీర్తింప‌బ‌డాలి. ఇది జ‌గ‌న్ ప్లాన్. కానీ మోదీ జమిలి ఎన్నిక‌లు పేరుతో 2022 లోనే దేశ‌మంతా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే! జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి? అని ఓ ప్ర‌శ్న రెయిజ్ అవుతోంది. కానీ ఇదంత సుల‌భ‌మైన ప్ర‌క్రియ కాదు. జ‌మ‌లి ఎన్నిక‌ల‌కు ఎన్ని రాష్ర్టాలు ఒప్పుకుంటాయి?? అన్న‌ది పెద్ద క్వ‌శ్చ‌న్. జ‌మిలి ఎన్నిక‌ల వెనుక సాధ్యాసాధ్యాలు ఏంట‌న్న‌ది విశ్లేషించాలి. జ‌మిలి ఎన్నిక‌లు వెనుక పాజిటివ్-నెగిటివ్ రెండు కోణాలు విశ్లేషిస్తే చాలా సంగ‌తులే ఉన్నాయి.