“తెలుగు రాజ్యం” అంచనా నిజం!… కోనసీమలో జగన్ భారీ మర్పులివే!

ఇప్పటికే 11 నియోజవర్గాల్లో కొత్త ఇన్ ఛార్జ్లను నియమించిన ముఖ్యమంత్రి వైస్ జగన్… తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. ప్రధానంగా కోనసీమలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. వీటిలో కొన్ని ఊహించినవే అయినా.. మరికొన్ని మాత్రం అంచనాలకు అందలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు సిట్టింగులను జగన్ ఈ దఫా పక్కనపెట్టారని అంటున్నారు.

ఇటీవల కాలంలో మంగళగిరి సిట్టింగ్ ఎమెల్యే ఆర్కే రాజీనామా అనంతరం వైసీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అనంతరం గాజువాక వైసీపీ ఇన్ ఛార్జ్ అసంతృప్తి విషయం తెరపైకి వచ్చింది. ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీతో అదికాస్తా టీ కప్పులో తుఫానుగా మారి చల్లారిందని చెబుతారు. ఈ సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా ప్రధానంగా గతకొంతకాలంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణు మధ్య రచ్చ తారాస్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ బుజ్జగింపులు సక్సెస్ అయ్యాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా రామచంద్రాపురాన్ని పిల్లి కే కేటాయించిన జగన్… మంత్రి వేణుని రాజమండ్రి రూరల్ నుంచి రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది.

ఇదే సమయంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను ఈదఫా అసెంబ్లీకి పంపాలని జగన్ నిర్ణయించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా రాజమండ్రి అర్బన్ నుంచి భరత్ పోటీచేయబోతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రధానంగా అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ స్థానాలతోపాటు అమలాపురం ఎంపీ అభ్యర్థి మార్పు కూడా కన్ ఫాం అని తెలుస్తుంది. దీంతో ఈ విషయంలో కోనసీమలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సమయంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధకు పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ ను అమలాపురం ఎంపీగా బరిలోకి దింపే సూచనలు ఉన్నాయని అంటున్నారు. అప్పుడు అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్త వ్యక్తిని దింపబోతున్నారని తెలుస్తుంది. అతను ఒక ఐపీఎస్ అధికారి అనే చర్చ కోనసీమలో మొదలైంది.

ఇదే సమయంలో రాజోలు నియోజకవర్గంలో జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన రాపాక వరప్రసాద్ కే కన్ ఫాం చేశారని తెలుస్తుంది. అక్కడ మరో అభ్యర్థి దొరకకపోవడమే ఇందుకు కారణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక పి.గన్నవరం నియోజకవర్గం విషయానికొస్తే కొండేటి చిట్టిబాబుకి టిక్కెట్ లేదని అంటున్నారు. కార్యకర్తలు, నేతలు, సర్వేలు ఇదే విషయాన్ని బలంగా చెప్పాయని సమాచారం. ఈ విషయాన్ని “తెలుగు రాజ్యం” ఇప్పటికే అంచనా వేసిన సంగతి తెలిసిందే!