తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ వివాదంగా మారింది. పంచాయతీ కార్యదర్శి పోస్టులను అమ్ముకున్నారన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఒక్కో పోస్టకు 4 లక్షలకు అమ్ముడు పోయినట్టు చర్చించుకున్న ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ఇద్దరు అభ్యర్దులు సెక్రటరీ పోస్టుల అమ్మకం పై చర్చించకున్నారు. వారి ఫోన్ సంభాషణ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అసలే పంచాయతీ కార్యదర్శుల నియామకంలో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు ఆరోపిస్తుంటే తాజాగా ఈ ఆడియో టేపు కలకలం సృష్టిస్తోంది. ఆ ఆడియోలో వారు నాలుగు నిమిషాల పాటు ఏం చర్చించుకున్నారో మీరే వినండి.
అభ్యర్దుల ఆందోళనతో పంచాయతీ రాజ్ వెబ్ సైట్ లో కీ పేపర్, మార్కుల వివరాలు పొందుపరిచారు. కానీ పరీక్ష ప్రశ్నాపత్రాలు పరీక్ష నిర్వహణ సమయంలో వారే తీసుకున్నారు. దీంతో తాము సమాధానాలు గుర్తు పట్టేదేలా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వారు అన్ని వివరాలు పెట్టినా అవి కరక్టే అని గుర్తు పట్టే అవకాశం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శుల నియామకంలో అక్రమాలు జరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.