పవన్ కళ్యాణ్ మాటలకు పనులకు పొంతన ఉండదని చాలా సందర్భాల్లో జనసేన నేతలే చెబుతారనే సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చే వరకు తెలంగాణ ప్రజలకు వరి అన్నం తెలియదని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ కామెంట్ల గురించి తనదైన శైలిలో స్పందించారు.
పవన్ కళ్యాణ్ పనికిమాలినోడని సీనియర్ ఎన్టీఆర్ వచ్చి తెలంగాణ ప్రజలకు వరి అన్నం తినడం నేర్పారా అని ఆయన ప్రశ్నించారు. అలాంటి మూర్ఖులను నేను ఇప్పటివరకు చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో చెరువుల కింద 1100, 1200 సంవత్సరాల క్రితమే వరి పండిందని నిరంజన్ రెడ్డి వెల్లడించడం గమనార్హం. తెలంగాణలో ఇప్పటికీ వరి పండుతోందని చరిత్ర తెలియని మూర్ఖులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి వెల్లడించడం గమనార్హం.
భారతదేశంలో వరి పండించడంలో నంబర్ వన్ తెలంగాణ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు వైసీపీ మంత్రుల చేత తిట్లు తిన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణ మంత్రుల చేత కూడా తిట్లు తింటున్నారు. పవన్ కళ్యాణ్ తన మూర్ఖత్వంతో తిట్లు తింటుండటం ఆయన ఫ్యాన్స్ ను సైతం షాక్ కు గురి చేస్తోంది. సరిగ్గా తెలిసీతెలియని విషయాలను మాట్లాడటం వల్లే పవన్ కళ్యాణ్ కు ఈ పరిస్థితి ఎదురవుతోందని మరి కొందరు చెబుతున్నారు.
వరి అన్నం గురించి పవన్ చేసిన కామెంట్ల విషయంలో క్రిటిక్స్ నుంచి నెగిటివ్ అభిప్రాయాలే వ్యక్తమయ్యాయి. పవన్ కు కొత్తగా శత్రువులు అవసరం లేదని ఆయన మాటలే ఆయనకు కొత్త శత్రువులను క్రియేట్ చేస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఇకనుంచి అయినా కొన్ని అంశాల గురించి మాట్లాడే సమయంలో స్పష్టతను కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు.