తెలంగాణ సర్కార్ పై జర్నలిస్టులు గుర్రుగా ఉన్నారు. తెలంగాణ వచ్చినా తమ బతుకులు మారలేదని ఆవేదన చెందుతున్నారు. జర్నలిస్టుల ఆవేదన నుంచి పుట్టిన పాట ఇది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది జర్నలిస్టులు. ఉవ్వెత్తున ఎగిసి పడ్డ తెలంగాణ ఉద్యమంలో జనం గొంతుకకు తమ కలాన్ని, గళాన్ని కలిపి పోరాటంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని సీఎం కేసీఆర్ చాలా సందర్భాలలో చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్లు , స్థలాలు ఇస్తామని వారి సమస్యలు పరిష్కరిస్తామని అనేక సార్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు అవి అమలు కాక పోవడంతో జర్నలిస్టులు ఆవేదన చెందుతున్నారు. జర్నలిస్టుల ఆవేదనపై ప్రముఖ కళాకారుడు, గాయకుడు, జర్నలిస్టు నీల నరసింహ తాను పనిచేస్తున్న ఛానెల్ లో అప్పటికప్పుడు పాటను సహచర జర్నలిస్టులు సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. దానిని సోషల్ మీడియాలోకి వదలడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో కింద ఉంది మీరు చూడండి.