Mohan Babu: అసలు నువ్వు మనిషివేనా… జర్నలిస్టుల దాడి పై మండిపడిన రవి ప్రకాష్!

Mohan Babu: మంచు కుటుంబంలో జరుగుతున్న విభేదాల గురించి తరచూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నింటినీ కవర్ చేస్తూ మీడియా వారు రాత్రి పగలు అని తేడా లేకుండా మోహన్ బాబు ఇంటి ముందే ఉన్నారు అయితే మీడియా వారు ఇలా వ్యవహరించిన తీరుపై మోహన్ బాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఆయన కాస్త కంట్రోల్ తప్పి ఏకంగా రిపోర్టర్స్ చేతిలో ఉన్నటువంటి మైకులను లాక్కొని వాటిని నేలకేసి కొట్టడమే కాకుండా జర్నలిస్టులపై దాడి చేయడంతో కొంతమంది జనరల్ లిస్ట్లు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఒక కెమెరామెన్ కింద పడిపోయారు.. ఇలా మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆయనని అదుపు చేసే ప్రయత్నం చేశారు.

ఇలా జర్నలిస్టులపై దాడి చేయడంతో జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. ఇలా మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడానికి వ్యతిరేకిస్తున్నామని ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్టు రవి ప్రకాష్ సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబు వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రవి ప్రకాష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నువ్వు మనిషివేనా మోహన్ బాబు అంటూ ప్రశ్నించారు.. మోహన్ బాబు అధ:పాతాళానికి దిగజారిపోయారు అంటూ కామెంట్ చేశారు. మీడియా పై దాడి చేయడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అహంకారమే కాదు సిగ్గుచేటు కూడా అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇలాంటి బిహేవియర్ను ఎవరూ సహించరంటూ మండిపడ్డారు రవి ప్రకాష్. ఇలా మోహన్ బాబు వ్యవహార శైలిని ప్రతి ఒక్కరు కూడా పూర్తిస్థాయిలో ఖండిస్తున్నారు