కవిత గ్రీన్ చాలెంజ్ కు డిప్యూటీసిఎం జవాబు

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ సోమవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసం ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

ముఖ్యమంత్రి ఓఎస్డీ హరితాహారం ఇంచార్జ్ ప్రియాంక వర్గీస్ చాలెంజ్ ను స్వీకరించిన ఎంపి కవిత శనివారం హైదరాబాద్ లోని తన ఇంటి ముందు మూడు మొక్కలు నాటి, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి పేర్లను  నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

సైనా నెహ్వాల్ మూడు మొక్కలను నాటి మరో ముగ్గురి పేర్లను నామినేట్ చేశారు. ఇక డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తన కుమారుడు మహమ్మద్ అజం అలీ, మనమడు ఫుర్కాన్ అహ్మద్ ల పేర్లను నామినేట్ చేస్తూ గ్రీన్ చాలెంజ్ విసిరారు. వారు ఇద్దరూ మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ చేస్తారు. ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు గ్రీన్ చాలెంజ్ ను వినూత్నంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హరితహారం కార్యక్రమం లో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.