తెలంగాణ సోమిరెడ్డి రాజీనామా చేశారట!
తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఆ గుర్తింపు తను అలంకరించిన మంత్రి పదవులవలనో లేక పార్టీ పదవులవలనో రాలేదు. విచిత్రంగా తాను వరుసగా ఐదు సార్లు ఓడిపోవడంతో అది ఆంధ్ర రాజకీయాల్లో సోమిరెడ్డికి ఒక గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఈమధ్య తెలంగాణలో కూడా అటువంటి నాయకుడు ఒకరు ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అతనెవరో కాదు సోమిరెడ్డి లాగే కాంగ్రెస్ అధిష్టానానికి వీర విధేయుడు, అనేకసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు.
దేశ స్థాయిలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 50 స్థానాలు గెలుచుకొని ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనను అనుసరిస్తూ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఓటమికి బాధ్యతను పంచుకుంటూ తమ పార్టీ పదవులకు కూడా రాజీనామాలు సమర్పిస్తున్నారు.
ఆ క్రమంలో వి.హనుమంతరావు కూడా తన జాతీయ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. వి హనుమంత రావు ని తీవ్రంగా విమర్శించే వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు రాజీనామా చేసిన తెలంగాణ సోమిరెడ్డి అని సెటైర్లు వేస్తున్నారు.
సోమిరెడ్డికి వి.హనుమంతరావు కి చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయి మీరిద్దరు అనేకసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు కేవలం పార్టీలోని అది నాయకత్వ ప్రాపకంతో వీరు అనేక పదవులు నిర్వహించారు. ఇద్దరికీ కూడా కాస్త నోరు ఎక్కువే రాజకీయ ప్రత్యర్థులను అధిష్టానం ప్రాపకం కోసం గీత దాటి విమర్శించే చరిత్ర కలిగిన వారే. అందుకే హనుమంత రావు ని తెలంగాణ సోమిరెడ్డిగా పిలుస్తున్నారు.