58 నుంచి 61 వరకు.! టీడీపీ కొత్త లెక్క.!

తెలుగుదేశం పార్టీలో రెండు నెంబర్ల గురించిన చర్చ జోరుగా సాగుతోంది. ఒకటేమో 58 కాగా, ఇంకొకటి 61.! ఏంటిది.? అసలేంటి కథ.? ‘త్యాగాలకు సిద్ధంగా వుండాలి..’ అంటూ కొన్నాళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తూ.. వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది.? జనసేనతో పోటీ వుంటుందా.? లేదా.? బీజేపీతో కలవడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఏమవుతాయి.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

టీడీపీతో కలవడానికి బీజేపీ సిద్ధమే.! కాకపోతే, ఎక్కువ ఎంపీ సీట్ల దిశగా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు, జనసేనకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు.. మరి, తెలుగుదేశం పార్టీ పరిస్థితేంటి.?

జనసేనకి ఓ పాతిక సీట్లు పారేస్తాం.. అనే స్థాయి నుంచి, ఓ ముప్ఫయ్ నలభై సీట్లు అయినా ఇచ్చేద్దాం తప్పదు.. అనే స్థాయికి వచ్చింది టీడీపీ. ఓ ఐదు ఎంపీ సీట్లు బీజేపీకి ఇవ్వక తప్పదు.! అలాగైతేనే, టీడీపీతో కలవడానికి బీజేపీ ఒప్పుకుంటుంది.!

ఇదిలా వుంటే, వచ్చే ఎన్నికల్లో జనసేనకు 58 వరకు సీట్లు ఇవ్వాల్సి రావొచ్చని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. కాదు కాదు, 61 సీట్ల దగ్గర డీల్ లాక్ అయ్యిందని తెలుగు తమ్ముళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇంకో ఇరవై ముప్ఫయ్ సీట్లు పెరిగితే.. చెరి సగం ఈక్వేషన్ వచ్చేయదూ.!

అయినాగానీ, తప్పదు.. చంద్రబాబు రాజకీయ అవసరాలు అలాంటివి.! టీడీపీ దయనీయ స్థితి అలాంటిది.!