సోషల్ మీడియాపై దృష్టి పెట్టిన టీడీపీ, వైసీపీ.. విజయం ఏ పార్టీదో?

TDP-YCP-Clashes

ప్రస్తుతం రాజకీయ పార్టీల రిజల్ట్ ను సోషల్ మీడియా కూడా కొంతమేర డిసైడ్ చేస్తోంది. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియాపై కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్నాయనే సంగతి తెలిసిందే. టీడీపీ సోషల్ మీడియాపై ప్రస్తుతం మరింత ఎక్కువగా దృష్టి పెడుతోంది. సోషల్ మీడియాలో కీలక మార్పులు చేస్తోంది. వైసీపీ సైతం సోషల్ మీడియా బాధ్యతలను కొత్త వాళ్లకు అప్పగిస్తున్నాయి.

ఎన్నికల్లో తమ పార్టీలకు అనుకూలంగా ప్రచారం జరిగేలా రెండు పార్టీలు అడుగులు వేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం అటు టీడీపీకి ఇటు వైసీపీకి ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. ఇకపై రెండు పార్టీలు ఒక పార్టీపై మరో పార్టీ దుష్ప్రచారం చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వనున్నాయి. జనసేనకు పవన్ కళ్యాణ్ అభిమానులే పొలిటికల్ ప్రచారానికి సంబంధించిన బాధ్యతలను తీసుకోనున్నారు.

వైసీపీ వీక్ గా ఉన్న నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. కుప్పం కచ్చితంగా వైసీపీ ఖాతాలోకి వచ్చేలా జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ ఒక్క ఏడాది జగన్ అభివృద్ధిపై దృష్టి పెడితే మాత్రం రిజల్ట్ మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జగన్ ఎన్నో వ్యూహాలను సిద్ధం చేసుకున్నారని టీడీపీ, జనసేన ప్లాన్స్ కు అనుగుణంగా వ్యూహాలను మారుస్తున్నారని సమాచారం అందుతోంది. జగన్ 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. జగన్ ప్రణాళికలు సక్సెస్ అయ్యి వైసీపీ మళ్లీ రాష్ట్రంలో సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాల్సి ఉంది.