ఆ నియోజకవర్గాల్లో టీడీపీ స్పెషల్ సర్వే.?

మొత్తంగా 58 నుంచి 75 నియోజకవర్గాల్లో ప్రత్యేక సర్వే చేయిస్తోందిట తెలుగుదేశం పార్టీ. అవన్నీ జనసేన పార్టీ, టీడీపీ నుంచి పొత్తులో భాగంగా కోరుతున్న నియోజకవర్గాలట. వాటిల్లో మళ్ళీ మెజార్టీ నియోజకవర్గాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే వున్నాయట.!

35 నియోజకవర్గాల్లో ఒంటరిగానే అయినా గెలుస్తాం.. అన్నది జనసేన ధీమా. టీడీపీతో పొత్తు.. అనుకుంటే, మరో పదిహేను నుంచి ఇరవై సీట్ల వరూ గెలుస్తామన్న ఆశాభావం జనసేన పార్టీలో వుంది. మొత్తంగా యాభై నియోజకవర్గాలన్నమాట.. అటూ ఇటూగా.. జనసేన ఆశిస్తున్నవి.

మరి, 58 నుంచి 75 నియోజకవర్గాల సంగతేంటి.? ఆ మిగిలిన ఇరవై ఐదు నియోజకవర్గాల్లో జనసేన మద్దతుతో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందట. జనసేన – టీడీపీ సరిసమానంగా ఆయా నియోజకవర్గాల్లో బలంగా వున్నాయట.

ప్రస్తుతానికైతే ఈ విషయమై రెండు పార్టీల మధ్య తెరవెనుకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి సర్వేలకు సంబంధించిన రిపోర్టులు వస్తాయట. ఆ తర్వాతే, రెండూ పార్టీల ముఖ్యూల ఒక్క చోట కూర్చుని, పొత్తులపై ఏదో ఒక నిర్ణయం ప్రకటించేస్తారట.

ఇంతకీ, బీజేపీ సంగతేంటి.? టీడీపీ – జనసేన – బీజేపీ.. ఈ మూడూ కలిస్తే, అందులో బీజేపీ ‘ఆటలో అరటిపండు’ మాత్రమే. నరేంద్ర మోడీ మెప్పు కోసం ఒకటో రెండో ఎంపీ సీట్లను బీజేపీకి ఈ కూటమి కేటాయించే అవకాశం వుందట.