వద్దు బాబు వద్దు.. లోకేశ్ పాదయాత్ర గురించి టీడీపీ నేతలు అలా అన్నారా?

చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరనే ప్రశ్నకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లోకేశ్ అనే సమాధానం వినిపిస్తుంది. లోకేశ్ రాజకీయాలలో సత్తా చాటాలని భావిస్తున్నప్పటికీ ఆయనకు పరిస్థితులు అనుకూలించడం లేదు. గతంలో లోకేశ్ పలు సందర్భాల్లో పబ్లిక్ లో చేసిన కామెంట్లు పార్టీకి మైనస్ అయ్యాయనే సంగతి తెలిసిందే. లోకేశ్ ను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి లోకేశ్ కూడా ఒక కారణమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ పాదయాత్ర దిశగా అడుగులు వేస్తుండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం లోకేశ్ ను పాదయాత్ర చేయవద్దని సూచించాలని అచ్చెన్నాయుడు, మరి కొందరు నేతలకు చెబుతున్నారని సమాచారం అందుతోంది. లోకేశ్ జనంలోకి వెళ్లిన తర్వాత ఇష్టానుసారం మాట్లాడితే పార్టీకి నష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

లోకేశ్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే మంచిదని మరి కొందరు చెబుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు లోకేశ్ పాదయాత్ర చేయడం వల్ల పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అచ్చెన్నాయుడు మాత్రం మంచో చెడో లోకేశ్ వెంటే ముందుకు వెళ్లాలని చెప్పారని బోగట్టా. కొడుకును నాయకుడిగా చూడాలని చంద్రబాబు ఆశపడుతుండగా ఆయన కల ఎప్పటికి నెరవేరుతుందో చూడాల్సి ఉంది.

లోకేశ్ పాదయాత్ర విషయంలో చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియాల్సి ఉంది. అయితే పార్టీ ముఖ్య నేతలలో కొందరు మాత్రం లోకేశ్ పాదయాత్రను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో లోకేశ్ టీడీపీకి ప్లస్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. లోకేశ్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఆయన రాజకీయాల్లో సక్సెస్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.