రాజకీయాలు అంటే అంత అల్లాటప్పా కాదు. ఏరంగంలో అనుభవం లేకున్నా నెట్టుకురావచ్చు కానీ.. రాజకీయాల్లో మాత్రం అనుభవం అనేది చాలా ముఖ్యం. అందుకే.. రాజకీయ పార్టీలు సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇస్తాయి. అయితే.. ఇక్కడ సీనియర్లు అంటే వయసులో సీనియర్లు కాదు.. రాజకీయాల్లో సీనియర్లు అన్నమాట. తరాలు మారుతున్నట్టే రాజకీయాలు కూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ల మైండ్ సెట్ ను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లగలిగే నాయకుడే రాజకీయాల్లో మనుగడ సాధిస్తాడు. అటువంటి వ్యక్తే పార్టీకి అండగా ఉంటాడు.
అయితే.. తెలుగుదేశం పార్టీలో ఆలోటు చాలా ఉందట. ఏలోటు అంటే ముందుతరం నాయకుల లోటు. అంటే పార్టీని ముందుకు నడిపించే బాధ్యత తీసుకునే వాళ్లు. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని నిలబడి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అలాంటి వాళ్ల లోటు ప్రస్తుతం టీడీపీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఓపక్క యంగ్ అండ్ డైనమిక్ వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కి రాష్ట్రాన్ని అభ్యున్నతి దిశగా తీసుకెళ్తుంటే.. టీడీపీ మాత్రం ఇంకా చప్ప బ్యాచ్ నే పట్టుకొని ఏలాడుతోంది. పార్టీ అధినేత అంటే మారడు కాబట్టి.. ఆయన్ని వదిలేద్దాం.. కానీ మిగితా కేడర్ సంగతి ఏంటి? జిల్లా స్థాయి నాయకులు ఏరి? కీలక నేతలు ఏరి?
సీనియర్లే కొంప ముంచుతున్నారా?
ఇక.. పార్టీకి మేం సీనియర్లం అని చెప్పుకుంటున్న చాలామంది టీడీపీ నేతలే.. ఇప్పుడు పార్టీకి పట్టిన గతి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కూడా సీనియర్లనే గుడ్డిగా నమ్ముతారని.. పాత కాలం నాటి నిర్ణయాలనే ఇంకా తీసుకుంటే అప్ డేట్ ఎప్పుడు అవుతారంటూ పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
సరే.. ఈ సీనియర్లు ఔట్ డేటెట్. వాళ్లు ఇక అప్ డేట్ కారు. కానీ.. పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకునే వాళ్లు ఎవరు? గట్టి ప్రతిపక్షంగా ఉండాలంటే ప్రభుత్వంతో ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేసే సత్తా టీడీపీలో ఎవరికి ఉంది.. అంటే సమాధానం లేదు.
వచ్చే ఎన్నికల వరకైనా పుంజుకుంటుందా?
వచ్చే ఎన్నికలవరకైనా పార్టీ పుంజుకోవాలంటే పార్టీకి ఖచ్చితంగా కొత్త రక్తం కావాలి. యువత పార్టీలో చేరాలి. యువనేతలు ఉంటే…. వాళ్లు తమ సరికొత్త ఆలోచనలతో పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు. అయితే.. యువత ఎవరైనా కాస్త రాజకీయాల్లో అనుభవం ఉంటే వాళ్లు మాత్రమే పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు. కానీ.. ఇప్పుడు పార్టీకి లోటు వాళ్లే. ఎక్కడో కొన్ని చోట్ల తప్పితే పార్టీలో యువతే లేదు.
ఇక… చంద్రబాబు కొడుకు లోకేశ్ గురించి తెలిసిందే కదా. ఆయన ఉన్నా పార్టీకి అదనంగా వచ్చే లాభం ఏం లేదు. అందుకే… ప్రతి జిల్లా నుంచి క్షేత్రస్థాయిలో యువతకు అవకాశం ఇస్తే పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సీనియర్లు రిటైర్ అయ్యే దశలో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి వాళ్లు రిటైర్ అయిపోతారు. అందుకే.. ఇప్పటి నుంచే యువతకు పార్టీలో అవకాశం ఇస్తే.. వచ్చే ఎన్నికల నాటికి వాళ్లకు కొంచెం అనుభవం వస్తుంది.. పార్టీని ముందుకు నడిపించగలుగుతారు.. అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే.. దీనిపై చంద్రబాబు పాజిటివ్ స్పందిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. పార్టీకి చెందిన కొందరు నాయకులు కూడా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని.. యువతకు అవకాశం ఇవ్వాలని బాబుకు సూచిస్తున్నా.. అది కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. ఎన్నికల వరకు కూడా చంద్రబాబు తన పంథాను మార్చుకోకుండా.. వీళ్లతోనే పార్టీని నెట్టుకొస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి సేమ్ పరిస్థితి రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.