టీడీపీ లో మరో వికెట్ పడింది… జగన్ కి మద్దతిస్తూ పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!

tdp mlc pothula sunitha resigned for her post and planning to join in ycp

ఆంధ్ర ప్రదేశ్: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ గా కొనసాగుతున్న పోతుల సునీత తన పదవికి రాజీనామా చేసింది. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కు పంపించారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగునా కోర్టులను అడ్డుపెట్టుకుని టీడీపీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ అడ్డుకుంటున్నారని రాష్ట్రంలో టీడీపీ వైఖరి రాజ్యంగా నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని దీనికి నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

tdp mlc pothula sunitha resigned for her post and planning to join in ycp
tdp mlc pothula sunitha resigned for her post and planning to join in ycp

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా నిలవాలని రాజీనామా చేయాలని అనుకున్నట్టు తెలిపారు. తన ఈ రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు.పోతుల సునీత 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు. దీంతో అక్కడ వర్గ విభేదాలు తెరపైకి వచ్చాయి. దీనితో అప్పటి సీఎం చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి వైసీపీలో చేరగా.. ఆమె మాత్రం టీడీపీలో కొనసాగారు. కానీ కొద్దిరోజుల తర్వాత అనూహ్యంగా వైసీపీ మద్దతు ఇచ్చారు. ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులపై జరిగిన ఓటింగ్ విషయంలో టీడీపీకి ఆమె షాకిచ్చింది. దీంతో టీడీపీ అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ తరుణంలోనే సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీ కి షాక్ ఇచ్చింది.