అబ్బో ఇదేం పంచ్ రా బాబు.. వెల్లంపల్లి గాలి మొత్తం పోయింది గా!

అధికార ప‌క్షం-ప్ర‌తిప‌క్షం నేత‌ల మ‌ధ్య ఆరోప‌ణ‌లు..ప్ర‌త్యారోప‌ణ‌లు త‌రుచూ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇటివ‌లి కాలంలో ఆ స్పీడ్ మ‌రింత ఎక్కువైంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ మంతెన స‌త్య‌నారాయ‌ణ రాజు వైసీపీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ప‌దునైన పంచ్ ల‌తో వెల్లంప‌ల్లిపై విరుచుకుప‌డ్డారు. వెల్లంప‌ల్లి దేవుడు ద‌ర్శ‌నానికి వెళ్లి గుడిలో హుండీ కొట్టేసే మ‌నిషి అని..ఆయ‌న‌కు దేవాద‌య శాఖ ఇచ్చినందుకు దేవుడు కూడా బాధ‌ప‌డుతున్నాడ‌నిని విమ‌ర్శించారు. వెల్లంప‌ల్లి వార్డు మెంబ‌ర్ కి ఎక్కువ‌..కార్పోరేట‌ర్ కి త‌క్కువ‌ని ఎద్దేవా చేసారు. కాలం క‌లిసొచ్చి మంత్రి అయ్యారు త‌ప్ప‌..అస‌లు మంత్రి అయ్యే ల‌క్ష‌ణం ఆయ‌న ద‌గ్గ‌ర ఒక్క‌టైనా ఉందా అని ప్ర‌శ్నించారు.

Vellampalli Srinivas
Vellampalli Srinivas

అలాంటి వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడ్ని విమ‌ర్శించ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. వెల్లంప‌ల్లికి జ‌గ‌న్ భ‌జ‌న‌లు, కీర్త‌న‌లు త‌ప్ప అస‌లు విష‌యాలు ప‌ట్ట‌వా? రాష్ర్టంలో ఏం జ‌రుగుతుందో అర్ధం కావ‌డం లేదా? అని మండిప‌డ్డారు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి 16 నెల‌లు అవుతుంది. ఇంత కాలం దేవాద‌య శాఖ మంత్రిగా ఆయ‌నేం చేసారో చెప్పాల‌ని డిమాండ్ చేసారు. భ‌క్తుల మ‌నోభావాలు మంత్రిగారికి ప‌ట్ట‌డం లేద‌ని, భూక‌బ్జాల‌పై చూపించిన ఆస‌క్తి భ‌క్తుల‌పై చూప‌డం లేద‌ని మండి ప‌డ్డారు. దేవాల‌యాల‌కు వ‌చ్చే ఆదాయాలు లెక్కిస్తున్నారు త‌ప్ప‌! భ‌క్తుల‌కు అక్క‌డ ఎలాంటి సౌక‌ర్యాలున్నాయి? లాక్ డౌన్ స‌మ‌యంలో అర్చ‌కులు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారు? వాళ్ల‌కు ప్ర‌క‌టించిన స‌హాయం అందిందా? లేదా? అన్న వివ‌రాలు ఎవ‌రినైనా అడిగి తెలుసుకున్నారా? అని ఆక్షేపించారు.

మొత్తానికి వెల్లంప‌ల్లిపై ఎమ్మెల్సీ దాడి ధీటుగానే ఉంది. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌పై వెల్లంప‌ల్లి ఎలాంటి బ‌ధులిస్తారు? అన్న‌ది చూడాలి. గ‌తంలోనూ ప‌లువురు టీడీపీ నేత‌లు వెల్లంప‌ల్లిని టార్గెట్ చేసి తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వాటికి వెల్లంప‌ల్లి ఎంత మాత్రం త‌గ్గ‌కుండా ధీటైన బ‌ధులిచ్చారు. అవ‌స‌రం మేర స‌వాళ్లు విసిరి త‌న నిజాయితీని నిరుపించుకున్నారు. ఆ త‌ర్వాత టీడీపీ శ్రేణుల స్పీడ్ కాస్త త‌గ్గింది. మ‌ళ్లీ ఏపీలో తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు వెల్లంప‌ల్లి వైపు దూసుకొస్తున్నారు. మ‌రి ఈ స్పీడ్ ని ఎలా అడ్డుకుంటారో? వెయింట్ అండ్ సీ!