వైసీపీ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా త్వరలో మంత్రి పదవిని కోల్పోనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజా చేసిన తప్పులే ఆమె పదవిని కోల్పోవడానికి కారణమవుతున్నాయని సమాచారం అందుతోంది. మంత్రి పదవి కోసం రోజా చేసిన పూజలు వృథానే అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. రోజా ఈటీవీలో ప్రసారం కానున్న దసరా ఈవెంట్ లో మెరిసిన సంగతి తెలిసిందే.
మంత్రి పదవి చేపట్టిన వాళ్లు టీవీ షోలకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కొన్ని నిబంధనలు ఉన్నాయి. రోజా ఈ షోలో పాల్గొనడం విషయంలో ఇప్పటికే జగన్ కు ఫిర్యాదులు అందాయని సమాచారం అందుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా రోజాపై ప్రజల నుంచి విమర్శలు వచ్చాయని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి రోజా ఎక్కువ సమయం కేటాయించలేదని బోగట్టా.
మంత్రి పదవి వచ్చినా రోజా తనకు ఇచ్చిన శాఖ అభివృద్ధి కోసం పెద్దగా కృషి చేయలేదని జగన్ కు నివేదికలు అందాయని తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా రోజా ఆలస్యంగా స్పందిస్తున్నారని సీఎం జగన్ భావిస్తున్నట్టు బోగట్టా. రోజా ఈటీవీ ఛానల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం కూడా జగన్ కోపానికి కారణమైంది. జగన్ రోజాకు షాకిస్తే ఆమె ఎలా ఫీలవుతారో చూడాల్సి ఉంది.
రోజాకు మంత్రి పదవి దక్కిన ఆనందం ఎంతోకాలం నిలవదని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం రోజా కేసీఆర్ ను, విజయమ్మను కలవడం కూడా జగన్ కోపానికి కారణమైందని బోగట్టా. ఐదు మంది మంత్రులకు షాకివ్వడానికి జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రోజా మంత్రి పదవిని పోగొట్టుకుంటే ఆమెకు రాబోయే ఎన్నికల్లో టికెట్ దొరకడం కూడా కష్టమని చెప్పవచ్చు. వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం.