ఏపార్టీ అయినా అధికారంలోకి ఎందుకు రావాలనుకుంటుంది? అసలు ఏ వ్యక్తి అయినా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటారు? ఆ బేసిక్స్ మరిచిపోయారో ఏమో కానీ… తాము అధికారంలోకి వచ్చాక కక్ష తీర్చుకోవడమే తమ మొదటి పని అని చెబుతున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
అవును… ఇప్పటికే పార్టీ లేదు డ్యాష్ లేదంటూ కెమెరాలకు చిక్కి, పార్టీ పరువు తన పరువు ఒకేసారి తీసుకున్న అచ్చెన్న.. మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, పవర్ లోకి వచ్చాక మొదటి ఆరునెలలు వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవడమే తమ పని అని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.
ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం జగన్ ఆదేశాలతో పోలీసులు, అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకొచ్చిన అచ్చెన్న… టీడీపీ అధికారంలోకి వచ్చాక వారెవరినీ వదిలిపెట్టబోమని తేల్చి చెబుతున్నారు. కడప జిల్లాలో టీడీపీ కీలక సమావేశం సందర్భంగా అచ్చెన్న ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో జగన్ లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరూ లేరని అచ్చెన్న దుయ్యయట్టారు!
ఇదిలా ఉంటే… ప్రస్తుతం అచ్చెన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే పలు సభల్లో చంద్రబాబు నాయుడు సైతం పోలీసులకు సూటిగా వార్నింగ్ లు ఇస్తున్నారు. అందరినీ గుర్తుపెట్టుకుంటున్నామని.. తాము అధికారంలోకి వస్తే వాళ్లందరిపని పడతామంటూ హెచ్చరించారు. ఇదే క్రమంలో… లోకేష్ కూడా… మైకందుకున్న ప్రతీసారీ… తాము అధికారంలోకి వచ్చినతర్వాత వడ్డీతో సహా అన్నీ చెల్లిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో… అచ్చెన్న కూడా ఇటువంటి కామెంట్స్ చేయడం గమనార్హం. ఇక్కడ అసలు గమనించాల్సిన విషయం ఏమిటంటే… ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్న టీడీపీ నేతలు… తాము అధికారంలోకి వచ్చాక కూడా అదే పని చేస్తామని చెప్పడం అర్ధరహితమని కామెంట్ చేస్తున్నారు విశ్లేషకులు.
మీమీ రివేంజ్ లు తీర్చుకొవడానికి అధికారంలోకి రావాలని కోరుకోవడం ఏమిటో… పైగా అధికారంలోకి వచ్చిన మొదటి ఆరునెలల్లోనే ప్రజలకు అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పాల్సిన నేతలు… “జగన్ పై కక్ష తీర్చుకోవాలి, తమకు అధికారం ఇవ్వండి” అని ప్రజలను అడగడం ఏమిటో అర్ధం కావడం లేదని అంటున్నారు నెటిజన్లు!