జగన్ దాడిపై టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన కామెంట్స్

జగన్ పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు పాయకరావు పేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ తరపున ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటవంటివి ఎవరికీ జరగకూడదని ఆమె ఆశించారు. జగన్ కి చిన్న గాయమైతేనే హుటాహుటిన స్పందించిన గవర్నర్, కేంద్ర ప్రభుత్వం కిడారి, సోములను హత్య చేసినా ఎందుకు స్పందించలేదంటూ నిలదీశారు. ఇంకా ఆమె ఏం మాట్లాడారో పూర్తిగా కింద ఉంది చదవండి.

ఈ ఘటనలో మమ్మల్ని బాధిస్తున్న అంశం ఏమిటంటే జగన్ మోహన్ రెడ్డి మీద దాడి చేసింది ఆయన అభిమాని. ప్రతి చిన్న విషయానికి సీఎం ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ప్రజలు గ్రహించాలి. ఎయిర్పోర్ట్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భద్రత సిబ్బంది ఉంటారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం తరపున శాంతి భద్రతలు అమలు చేసే పోలీసు వ్యవస్థకు సంబంధం ఉండదని తేల్చి చెప్పారు.

కేంద్ర ప్రభత్వ పరిధిలో ఉన్న ఎయిర్పోర్టు లాబీలో జగన్ కూర్చున్నప్పుడు సెల్ఫీ తీసుకుంటా అని నిందితుడు ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఎయిర్పోర్టు భద్రత సిబ్బంది అతని దగ్గర చాక్ ఉందా? కత్తి ఉందా? అని చెక్ చేయకుండా ఎందుకు పంపించారు? అని ప్రశ్నించారు. అది వారి వైఫల్యం. కేంద్ర ప్రభుత్వ తాలూకా వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభత్వ వైఫల్యంగా చూయించి చంద్రబాబుని టార్గెట్ చేయడమేంటనీ నిలదీశారు.

వైసీపీ శ్రేణులంతా బయటకొచ్చి విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్నారు. ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? జరిగిన ఘటనకు సీఎం కి సంబంధం ఏమిటి? జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరికీ ఇలాంటి ఘటనలు జరగకూడదు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పట్టుకోవడం, విచారించడం, వివరాలు వెల్లడించడం అన్ని జరిగాయి.

ఈ ఘటనలో మా నియోజకవర్గం తరపున నేను బాధ పడుతున్న అంశం ఏమిటంటే… సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని, మాజీ ఎమ్మెల్యే సివేరి సోములను మావోయిస్టులు హత్య చేసినప్పుడు గవర్నర్ కానీ, కేంద్ర మంత్రులు కానీ ఆ సంఘటనపై స్పందించలేదు. వారు గిరిజన ఎమేల్యేలనా? వాళ్ళ పార్టీ నుండి టీడీపీ లోకి వచ్చారనా? ఏ ఉద్దేశంతో మీరు కనీసం ఆరోజు స్పందించలేదు?

జగన్ పై దాడి జరిగిన 15 నిమిషాలలోపే గవర్నర్ డీజీపీకి ఫోన్ చేశారు.ఒక ప్రతిపక్ష నేత గురించి మాట్లాడొచ్చు కానీ అదే విశాఖపట్నంలోనే మావోయిస్టులు ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని చంపేశారు ఆరోజు స్పందించని గవర్నర్ ఈనాడు స్పందిస్తున్నారు. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినవి ఎలాగైతే జరిగాయో, శివాజీ చెప్పినట్టు ఆపరేషన్ గరుడ అలానే జరుగుతోంది. ఇది కేవలం సీఎం ని టార్గెట్ చేస్తూ జరుగుతున్న ఘటనలే అని ప్రజలు గ్రహించాలని ఎమ్మెల్యే అనిత వెల్లడించారు.