వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే అనిత: డ్రైవర్ నిర్వాకంతో రచ్చ

టీడీపీ మహిళా నేతల్లో ఎమ్మెల్యే అనిత తరచు ఇదొక వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇటు వైసీపీ నేతలపై కూడా ఆమె పలుసార్లు వాగ్వాదానికి దిగి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో నగరి ఎమ్మెల్యే రోజాతో కూడా ఆమె పలుమార్లు విభేదించారు. ఆమెపై సంచలన కామెంట్స్ చేసారు. ఈ విషయంలో ఇద్దరికీ మధ్య తారాస్థాయిలో మాటల యుద్ధమే నడిచింది.

ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. ఆమె డ్రైవర్ చేసిన నిర్వాకం ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకుంది. ఈ విషయం బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఐంది.  ఒకేసారి ఇద్దరు మంత్రులను మోసం చేయబోయాడు అనిత కారు డ్రైవర్ అఖిల్. ఏకంగా మంత్రులనే మోసం చేయబోవడం తీవ్ర దుమారం రేపుతోంది.

ఒక ఉద్యోగం కోసం నకిలీ సిఫార్సు లేఖను ఒక శాఖామంత్రికి, మరో శాఖామంత్రి పేరు మీద రాశాడు. ఇంతకీ ఆ రికమండేషన్ ఎవరి పేరు మీదనో తెలుసా? ఆ సిఫార్సు లేఖ ఏ మంత్రికో తెలుసా? ఈ వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవాల్సిందే…

వంగలపూడి ఎమ్మెల్యే అనిత కారు డ్రైవర్ అఖిల్ గొప్ప ఘనకార్యం చేసాడు. విద్యుత్ శాఖామంత్రి కళా వెంకట్రావుకి… ఆర్ధిక శాఖామంత్రి యనమల పేరుతో రికమండేషన్ లెటర్ రాశాడు. ఈ లెటర్ లో విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇవ్వాలంటూ పేర్కొన్నాడు.

ఆ ఈమెయిల్ ను కళా వెంకటరావు మంత్రి యనమల దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో అతని బండారం బయట పడింది. ఈ లేఖపై అనుమానం వచ్చిన యనమల కార్యాలయ ప్రతినిధులు కళా వెంకట్రావు పేషీకి సమాచారం అందించారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అతని వ్యవహారం బట్టబయలైంది. ఉద్యోగం కోసం అతనే నకిలీ సిఫార్సు లేఖ తెచ్చాడని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు.

రంగంలోకి దిగిన పోలీసులు అనిత డ్రైవర్ అఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా అతనిపై కేసు పెట్టకుండా ఎమ్మెల్యే అనిత పోలీసులపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. పోలీసులు ఫిర్యాదు అందలేదు అని చెప్పడం గమనార్హం.