రామోజీ చెప్పిందే చెబుతున్న భవానీ… టీడీపీ లాజిక్ మరీ పూర్!

జగజ్జననీ చిట్‌ ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో చట్ట వ్యతిరేక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయన్న అభియోగాలపై ఆ సంస్థ డైరెక్టర్లు.. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ మే 12వ తేదీ వరకు రిమాండ్‌ విధిస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే… ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చెబుతున్న వాదన, ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు చెబుతున్న లాజిక్ లు మరీ పూర్ గా ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు చిట్‌ ఫండ్‌ నిర్వహిస్తున్నారు. అయితే.. ప్రజల నుంచి చిట్స్‌ వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ ఫండ్‌ మోసాలపై సీఐడీకి, కాకినాడ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్టు, చిట్స్‌ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు.

అయితే ఈ విషయాలపై స్పందించిన ఆదిరెడ్డి భవానీ… “ఇది కక్ష సాధింపు అనే అనుకోవాలి. 30 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం. ఎప్పుడూ కనిపించనివి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి. చాలా ప్రభుత్వాలు మారాయి. ఏదైనా లోటుపాట్లు ఉంటే అప్పటి నుంచి బయటకు వచ్చేవి. ఫిర్యాదులు చేసేవారు. కానీ ఇవేమీ లేకుండా.. ఎందుకు దాడులు చేస్తున్నారు” అని స్పందించారు. సరిగ్గా రామోజీ రావు కూడా మార్గదర్శి విషయంలో ఇదే వాదన లేవనెత్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

“ఎవరూ ఫిర్యాదులు చేయలేదు.. ఇంతకాలం కనిపించనివి ఇప్పుడెందుకు కనిపిస్తున్నాయి”.. వంటి ప్రశ్నలు రామోజీని వదిలేస్తే.. తర్వాత చిట్ ఫండ్స్ చేస్తున్న వారంతా ఇదే వాదన వినిపిస్తారని ఉండవల్లి చెప్పిన విధంగానే… నేడు ఆదిరెడ్డి భవానీ విమర్శలు చేయడం గమనార్హం.

ఇక ఇదే సమయంలో… ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ నేతలు మరీ పూర్ లాజిక్ ని తెరపైకి తెస్తున్నారు. అదేమిటంటే… “ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారనే కక్షతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులను జైలులో పెట్టడం దుర్మార్గం” అని! టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్సీకి ఓటు వేస్తే జగన్ అరెస్టులు చేస్తున్నారంట. మరి మిగిలిన 20 మందిపై జగన్ ఎందుకు దాడులు చేయడం లేదు. తన పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్.

టీడీపీ నేత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని సీఐడీతో జగన్ దాడులు చేయిస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. దీంతో.. ఇంతకు మించిన పూర్ లాజిక్ ఉంటుందా అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అదే నిజమైతే… ఇప్పటికే మిగిలిన 20మంది టీడీపీ ఎమ్మెల్యేలపై కూడా దాడులు జరిగేవిగా! అంటే… వారంతా నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.. ఆదిరెడ్డి మాత్రం అలా చేయడం లేదని తెలుసుకున్న జగన్ ఆమెపై కక్ష సాదిస్తున్నారని టీడీపీ నేతలు చెప్పబోతున్నారా?