ఆ కామెంట్లతో అడ్డంగా బుక్కైన చంద్రబాబు.. ఇప్పుడేం సమాధానం చెబుతారో?

కొన్నిరోజుల క్రితం గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. వైరల్ అయిన వీడియో వల్ల తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. గోరంట్ల మాధవ్ ను డిస్మిస్ చేయాలని టీడీపీ నేతల నుంచి డిమాండ్లు వ్యక్తమయ్యాయి. అయితే అనంతపురం పోలీసులు మాత్రం వైరల్ అయిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపలేదని ఒరిజినల్ వీడియో దొరికితే మాత్రమే వాస్తవాలు తెలుస్తాయని వెల్లడించారు.

అయితే పోలీసులు ఈ విషయాలను వెల్లడించిన రెండు రోజుల తర్వాత వైరల్ అయిన వీడియో ఒరిజినల్ వీడియో అని టీడీపీ అధికార ప్రతినిధి అయిన పట్టాభి, వంగలపూడి అనిత వెల్లడించారు. అమెరికాలోని ప్రముఖ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇందుకు సంబంధించి నివేదిక ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ నివేదిక గురించి స్పందిస్తూ ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

టీడీపీ నేతల నుంచి విడుదలైన నివేదిక ఫేక్ అని ఫోరెన్సిక్ నిపుణుల నుంచి సమాచారం అందిందని ప్ర‌ముఖ ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫోర్డ్ ఈ మేరకు సమాచారం ఇచ్చాడని సునీల్ కుమార్ కామెంట్లు చేశారు. వీడియో కంటెంట్ ఒరిజినల్ అని ల్యాబ్ చెప్పలేదని ప్రైవేట్ ల్యాబ్ లు ఇచ్చే నివేదికలకు వాల్యూ ఉండదని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్కైంది ఎవరనే ప్రశ్నకు చంద్రబాబు పేరు వినిపిస్తోంది.

టీడీపీ వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఈ వీడియో వైరల్ అయిందని మొదట ఐటీడీపీ గ్రూప్ లో ఈ వీడియో పోస్ట్ అయిందని వెల్లడించి పోలీసులు ఇప్పటికే టీడీపీ పరువు తీశారు. టీడీపీ నేతలు ప్రచారం చేసిన నివేదిక ఫేక్ అని తేలడంతో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ పరువు తీయాలని ప్రయత్నించి టీడీపీ పరువు పోగొట్టుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.