టీడీపీ మేనిఫెస్టో.. వైఎస్ జగన్ సెల్ఫ్ గోల్.!

భలే పంచ్ వేశాడుగా జగనన్న.. అంటూ సోషల్ మీడియాలో వైఎస్ జగన్ సైన్యం నానా హంగామా చేసింది. కానీ, ఆ హంగామా కాస్సేపే. ఆ తర్వాత ట్రోలింగ్ షురూ అయ్యింది. అత్యంత దారుణమైన రీతిలో ట్రోలింగ్ జరిగింది.

విషయంలోకి వెళితే, ఇటీవల మహానాడు సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘పాక్షిక మేనిఫెస్టో’ని ప్రకటించారు. వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాలపై మండిపడుతూ, ఆంధ్రప్రదేశ్‌ని శ్రీలంకతో పోల్చారు చంద్రబాబు. కానీ, ‘మేం అధికారంలోకి వస్తే, అంతకు మించిన సంక్షేమం చేస్తాం’ అని చంద్రబాబు అంటున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా వైఎస్ జగన్ సెటైర్లేశారు. ‘చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో కర్నాకలో పుట్టింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోల్లోంచి కొన్ని పాయింట్లు తీసుకుని, టీడీపీ మేనిఫెస్టో.. అని చంద్రబాబు హడావిడి చేస్తున్నారు..’ అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.

అదే సమయంలో, ‘మా పథకాలు కాపీ కొట్టారు’ అని చంద్రబాబు మేనిఫెస్టోపై మండిపడ్డారు వైఎస్ జగన్. పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తే, ట్రోలింగ్ తప్పదు మరి.!

మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని దక్షిణాఫ్రికా నుంచి తీసుకున్నప్పుడు, భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి మేనిఫెస్టోని చంద్రబాబు తీసుకుంటే తప్పేంటి.? అన్న ప్రశ్నలు అధికార వైసీపీకి ఎదురవుతున్నాయి. దీన్నే సెల్ఫ్ గోల్ అంటారు మరి.!